న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్.. లేకుండా జట్టును ప్రకటించడమా: గంగూలీ

India Vs West Indies : Sourav Ganguly Surprises With Rohit Sharma's Omission From Test | Oneindia
Sourav Ganguly surprised by Rohit Sharmas omission from Test series vs West Indies

న్యూ ఢిల్లీ: ఇంగ్లాండ్ పర్యటన అనంతరం టీమిండియా చేపట్టిన ఆసియా కప్ టోర్నీని విజయవంతంగా ముగించింది. ఆసియాకప్‌ ముగిసిన నేపథ్యంలో క్రికెట్‌ అభిమానుల కళ్లన్నీ వెస్టిండీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌ ‌మీదే ఉన్నాయి. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో విఫలమయినా ఆసియాకప్‌లో టీమిండియా ఉత్తమ ప్రదర్శన కనబర్చి.. ఏడోసారి ట్రోఫీని ముద్దాడింది.

<strong>సినిమా హీరోకు తన జెర్సీని బహుమతిగా ఇచ్చిన లియోనల్ మెస్సీ</strong>సినిమా హీరోకు తన జెర్సీని బహుమతిగా ఇచ్చిన లియోనల్ మెస్సీ

వెస్టిండీస్‌తో ఆడబోయే ఆటగాళ్ల పేర్లు

వెస్టిండీస్‌తో ఆడబోయే ఆటగాళ్ల పేర్లు

ఇంకొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న వెస్టిండీస్‌ టెస్టు సిరీస్‌కు సంబంధించి టీమిండియా జట్టును శనివారం ప్రకటించారు. ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ వెస్టిండీస్‌తో ఆడబోయే ఆటగాళ్ల పేర్లు ప్రకటించింది. అయితే టెస్టుల్లో ఓపెనర్‌ రోహిత్ శర్మకు స్థానం దక్కకపోవడంపై సౌరవ్‌ గంగూలీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ఆసియాకప్‌లో టీమిండియా ఘనవిజయం

ఆసియాకప్‌లో టీమిండియా ఘనవిజయం

ఆసియాకప్‌లో ధీటుగా రాణించి భారత్‌కు ఏడో సారి కప్‌ సాధించిపెట్టిన రోహిత్‌ను సెలక్టర్ల విస్మరించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. దీనిపై గంగూలీ ట్వీట్‌ చేశాడు. ‘రోహిత్‌..నీ సారథ్యంలో ఆసియాకప్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. అయినా వెస్టిండీస్‌ టెస్టుకు ఎంపిక చేయలేదు. ఈ జట్టులో నీపేరు లేకపోవడం చూసి నేను ఆశ్చర్యానికి గురయ్యా' అంటూ గంగూలీ ట్వీట్‌ చేశాడు.

రోహిత్‌తో పాటు .. ధావన్ పైనా

రోహిత్‌తో పాటు .. ధావన్ పైనా

వెస్టిండీస్‌తో ఆడబోయే జట్టులో రోహిత్‌తో పాటు మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్ పైనా వేటు పడింది. ఆసియాకప్‌లో మెరుగ్గా రాణించినప్పటికీ ఇంగ్లాండ్‌ పర్యటనలో విఫలమవ్వడంతో అతడిని ఎంపిక చేయలేదు. ఇంగ్లాండ్‌ సిరీస్‌ మధ్యలోనే తుది జట్టుకు దూరమైన మరో ఓపెనర్‌ మురళీ విజయ్‌కి కూడా సెలక్టర్లు అవకాశమివ్వలేదు. మొహ్మద్‌ సిరాజ్‌, పృథ్వీ షా, మయాంక్‌ అగర్వాల్‌లకు ఈసారి జట్టులో చోటు లభించింది.

భారత జట్టు ఇదే.

భారత జట్టు ఇదే.

ఇండియాలో పర్యటించనున్న వెస్టిండీస్‌తో తలపడనున్న భారత జట్టు ఇదే.

విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, పృథ్వీ షా, ఛతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె, హనుమ విహారి, రిషబ్‌ పంత్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమి, ఉమేశ్‌, మొహమ్మద్‌ సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌

Story first published: Sunday, September 30, 2018, 14:24 [IST]
Other articles published on Sep 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X