For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సౌరవ్ గంగూలీకి మూడు స్టెంట్లు.. మ‌రో 48 గంట‌లు ఆసుప‌త్రిలోనే!!

 Sourav Ganguly stable after undergoing angioplasty

కోల్‌క‌తా: బీసీసీఐ అధ్య‌క్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీకి మొత్తం మూడు స్టెంట్లు వేయ‌నున్న‌ట్లు కోల్‌క‌తాలోని వుడ్‌ల్యాండ్స్ ఆసుప‌త్రి వైద్యులు వెల్ల‌డించారు. ఇప్ప‌టికే యాంజియో ప్లాస్టీ నిర్వ‌హించి ఒక స్టెంట్ వేశామ‌ని.. మ‌రో రెండు ఆది, సోమ‌వారాల్లో వేయాల్సి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం దాదా ఆరోగ్యం నిలకడగానే ఉందని, మ‌రో 48 గంట‌ల పాటు గంగూలీ హాస్పిట‌ల్‌లోనే ఉంటార‌ని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రి డాక్టర్ అఫ్తాబ్ ఖాన్ స్ప‌ష్టం చేశారు.

సౌరవ్ గంగూలీ ధమనులలో డాక్స్ ఫైండ్ సిగ్నిఫికెంట్ బ్లాకేజ్ అవ్వడంతోనే హార్ట్ ఎటాక్ వచ్చినట్టు సమాచారం తెలుస్తోంది. గంగూలీ మెలుక‌వ‌గానే ఉన్నార‌ని, త‌న కూతురు స‌నాతోనూ మాట్లాడార‌ని వుడ్‌ల్యాండ్స్ ఆసుప‌త్రి వైద్యుడు తెలిపాడు. విసిటింగ్ అవర్స్ కూడా ఏర్పాటు చేశారట. గంగూలీకి చికిత్స కోసం ముగ్గురు డాక్ట‌ర్ల‌తో ఒక టీమ్‌ను ఏర్పాటు చేసిన‌ట్లు సమాచారం. మొత్తంగా మ‌రో వారం రోజుల పాటు గంగూలీకి చికిత్స కొన‌సాగుతుంద‌ని తెలుస్తోంది.

సౌరవ్‌ గంగూలీ స్వల్ప గుండెపోటుకు గురయ్యారని తెలియడంతో క్రికెట్‌ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆయన త్వరగా కోలుకోవాలని క్రికెటర్లు, అభిమానులు కోరుకుంటున్నారు. సోషల్‌ మీడియా వేదికగా సందేశాలు పెడుతున్నారు. టీమిండియా ప్రస్తుత సారథి విరాట్‌ కోహ్లీ, బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జే షా, మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్‌, హర్భజన్‌సింగ్‌, అనిల్‌ కుంబ్లే, గౌతమ్‌ గంభీర్‌, పశ్చిమ్‌ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌.. దాదా వేగంగా కోలుకోవాలని ప్రార్థించారు.

బీసీసీఐ అధ్యక్షుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం - బీసీసీఐ

టీమ్ఇండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీకి ఈరోజు ఉదయం స్వల్ప గుండెపోటు వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. దాదా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం- ఐసీసీ

మీరు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. త్వరగా ఆరోగ్యవంతులు అవ్వండి గంగూలీ- విరాట్‌ కోహ్లీ

గుంగూలీ మీరు తొందరగా కోలుకోవాలి. అందుకోసం నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను -వీరేంద్ర సెహ్వాగ్‌

దాదా తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. గెట్‌ వెల్‌సూన్‌ - శిఖర్‌ ధావన్‌

గుండెపోటుకు గురైన గంగూలీ అత్యంత వేగంగా కోలుకోవాలి. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వుడ్‌ల్యాండ్‌ ఆస్పత్రి సీఈవో ద్వారా తెలిసింది- జగదీప్‌ ధన్‌కర్‌, బెంగాల్‌ గవర్నర్‌

Story first published: Saturday, January 2, 2021, 18:41 [IST]
Other articles published on Jan 2, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+