Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ట్వీట్.. రీట్వీట్: భజ్జీ సేవలను దాదా ఏ విధంగా వినియోగించుకుంటాడో మరి!

Sourav Ganguly and Harbhajan Singh

హైదరాబాద్: బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అక్టోబర్ 23న బాధ్యలు చేపట్టనున్నాడు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడి హోదాలో సోమవారం దాదా తన నామినేషన్ పత్రాలను సమర్పించి సంగతి తెలిసిందే. అధ్యక్ష బరిలో గంగూలీ ఒక్కడే పోటీ చేస్తుండటంతో అతడి ఎన్నిక లాంఛనమే.

అక్టోబర్ 23న గంగూలీ ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించనున్నారు. సెప్టెంబర్ 2020 వరకు దాదా ఈ పదవిలో కొనసాగనున్నాడు. అయితే బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా సౌరవ్‌ గంగూలీ బాధ్యతలు స్వీకరించనున్న తరుణంలో హర్భజన్‌ తన ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశాడు.

"నువ్వొక నాయకుడివి. మిగతా వారు నాయకులు కావడానికి నాయకుడిగా నిలిచిన వాడివి. కంగ్రాట్స్‌ గంగూలీ" అంటూ హర్భజన్‌ ట్వీట్‌ చేశాడు. నిజానికి గంగూలీ నాయకత్వంలో అనేక యువ క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. అందులో ఒకడు హర్భజన్ సింగ్. భజ్జీ సక్సెస్‌కు గంగూలీ కూడా కారణం.

అలానే గంగూలీ తనపై ఉంచిన నమ్మకాన్ని కూడా హర్భజన్‌ నిలబెట్టుకోవడంతో పాటు టీమిండియాకు అనేక విజయాలనందించాడు. ఈ నేపథ్యంలో భజ్జీ ట్వీట్‌కు గంగూలీ తనదైన శైలిలో స్పందించాడు. "థాంక్యూ భజ్జీ. నువ్వు ఎలాగైతే భారత్‌కు విజయాలు అందించావో అదే తరహా నీ సహకారం మాకు కావాలి. భజ్జీ.. నీ అవసరం ఉంది" అని గంగూలీ రీట్వీట్ చేశాడు.

గంగూలీ సైతం బీసీసీఐలో తన టీమ్‌ని తీసుకొచ్చేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో టీమిండియా కోచింగ్‌ స్టాఫ్‌ విభాగంలో ఏమైనా కీలక బాధ్యతలు అప్పచెబుతాడా? అనేది గంగూలీ మాటల్ని బట్టి అర్థమవుతోంది. చూద్దాం భజ్జీ సేవలను గంగూలీ ఏ విధంగా వినియోగించుకుంటాడో?

Story first published: Thursday, October 17, 2019, 13:28 [IST]
Other articles published on Oct 17, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+