For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ద్రవిడ్‌ను యువీలా ఆడించలేం.. యువీని ద్రవిడ్‌లా ఆడమనలేం'

Sourav Ganguly says Cant expect Rahul Dravid to act like Yuvraj Singh or vice-versa

కోల్‌కతా: భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌ను ఆల్‌రౌండర్‌ యువరాజ్ సింగ్‌లా ఆడించలేమని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. అలాగే యువీని కూడా ద్రవిడ్‌లా ఆడమని చెప్పలేమన్నాడు. అత్యుత్తమ సారథులు తమ తప్పుల నుంచే నేర్చుకుంటారని దాదా చెప్పుకొచ్చాడు. నాయకత్వ లక్షణాలపై ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో గంగూలీ పై విధంగా స్పందించాడు. భారత క్రికెట్‌ను కదిలించిన మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం తరువాత బీసీసీఐ గంగూలీకి కెప్టెన్సీని అప్పగించింది. ఆ తర్వాత అతను జట్టును అద్భుతంగా నడిపించాడు.

ద్రవిడ్‌ను యువీలా ఆడించలేం:

ద్రవిడ్‌ను యువీలా ఆడించలేం:

తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ... 'పరిస్థితులకు తగ్గట్టు నెట్టుకుపోవడం సారథ్య లక్షణాల్లో ముఖ్యమైనది. దేన్నైనా అందిపుచ్చుకోవడం నాయకత్వ లక్షణాల్లో ఒకటి. నాయకుడు జట్టు సభ్యుల సహజ ప్రతిభను గుర్తించాలి. యువరాజ్‌ సింగ్‌ను రాహుల్ ద్రవిడ్‌లా మార్చలేం.. యువీని కూడా ద్రవిడ్‌లా ఆడించలేం. ఎవరి ప్రత్యేకత వారిది. ఆటగాడి సొంత ప్రతిభ ఏంటో నాయకుడు తెలుసుకోవాలి' అని వివరించాడు. గంగూలీ 2012లో రిటైరయ్యాక బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడయ్యాడు. ఆపై గత అక్టోబర్‌లో అనూహ్యంగా బీసీసీఐ పగ్గాలు అందుకొన్నాడు. ఇప్పుడు ఐసీసీ సీటుపై కూడా కూర్చునే అవకాశం ఉంది.

అత్యుత్తమ సారథులు తప్పులు చేస్తారు:

అత్యుత్తమ సారథులు తప్పులు చేస్తారు:

'ఒకవేళ యువీని కూడా ద్రవిడ్‌లా ఆడిస్తే.. ఆ ప్రయోగం దారుణంగా విఫలమౌతుంది. అత్యుత్తమ సారథులు తప్పులు చేస్తారు. అయితే, వాళ్ల ఆలోచనా దృక్పథం సరిగ్గా ఉన్నంతకాలం అవన్నీ సానుకూలంగా ఉంటాయి. సరైన సారథిగా మారడానికి తప్పుల నుంచే నేర్చుకోవాలి. మిగతా విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓటములు ఎదురైతే కుంగిపోవాల్సిన అవసరం లేదు, అవి ఎదుగుదలలో భాగమే. వైఫల్యాల నుంచి నేర్చుకుంటే అవి గెలుపు బాటకు దారితీస్తాయి' అని సౌరవ్ గంగూలీ చెప్పాడు.

అనుకోకుండా క్రికెటర్‌నయ్యా:

అనుకోకుండా క్రికెటర్‌నయ్యా:

ఒకప్పుడు తనకు ఫుల్‌బాలే జీవితంగా ఉండేదని, ఆ తర్వాత అనుకోకుండా క్రికెటర్‌గా మారానని దాదా తాజాగా తెలిపారు. 'చిన్నతనంలో ఫుట్‌బాలే నా జీవితం. తొమ్మిదో తరగతి వరకూ అదే ఆడా. ఓసారి వేసవి సెలవుల్లో నేను ఇంట్లో ఖాళీగా ఉంటున్నానని మా నాన్న నన్ను క్రికెట్‌ అకాడమీలో చేర్పించారు. అత్యంత క్రమశిక్షణ పాటించే మా కుటుంబం నుంచి దూరంగా ఉండొచ్చనే ఉద్దేశంతో.. ఎంతో ఆనందంగా అకాడమీకి వెళ్లేవాణ్ని. అలా కొన్ని రోజులు సరదాగా గడిచాయి. కోచ్‌ నాలో ఏం గమనించాడో తెలీదు కానీ "మీ కొడుకును ఫుట్‌బాల్‌ మాన్పించి.. క్రికెట్లో కొనసాగేలా చూడండి" అని మా నాన్నకు చెప్పాడు. ఓ రోజు బంగాల్‌ క్రికెట్‌ సంఘం ట్రయల్స్‌కి పిలిస్తే.. లెఫ్ట్‌హ్యాండరైన మా అన్నయ్య కిట్‌ తీసుకుని వెళ్లా. ట్రయల్స్‌లో బాగా ఆడా. ఆ తర్వాత ఏంజరిగిందో అందరికీ తెలిసిన విషయమే' అని చెప్పాడు.

చొక్కా విప్పి గాల్లో తిప్పడం గంగూలీకే చెల్లింది:

చొక్కా విప్పి గాల్లో తిప్పడం గంగూలీకే చెల్లింది:

భారత క్రికెట్‌ స్థాయిని పెంచిన కెప్టెన్ సౌరవ్ గంగూలీ. ఈ విషయాన్ని అతడితో కలిసి ఆడిన ఆటగాళ్లతో పాటు మాజీలు కూడా ఒప్పుకుంటారు. 2000 నుంచి 2005 వరకు గంగూలీ కెప్టెన్సీలో భారత జట్టు ఎన్నో మైలు రాళ్లను చేరుకుంది. అప్పటి మేటి జట్లలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. గంగూలీ భారత క్రికెట్‌ను మార్చిన గొప్ప ఆటగాడు. ఆయన కారణంగా భారత క్రికెట్‌కు ఎనలేని పేరు ప్రతిష్ఠలు వచ్చాయి. జట్టు సభ్యులను ఉద్రేకపూరితంగా మార్చడంలో దాదా సఫలీకృతుడయ్యారు. 2002లో నాట్‌వెస్ట్‌ సిరీస్‌లో మ్యాచ్‌ గెలువగానే చొక్కా విప్పి గాల్లో తిప్పడం ఒక్క గంగూలీకే చెల్లింది.

Story first published: Friday, June 5, 2020, 15:21 [IST]
Other articles published on Jun 5, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+