అధైర్య పడకండి.. అద్భుతంగా ఆడారు.. ఏదో ఒక రోజు విజేతగా నిలుస్తారు: గంగూలీ

మెల్‌బోర్న్: మహిళల క్రికెట్‌లో దేశానికి తొలి ప్రపంచకప్ అందించాలనుకున్న భారత జట్టుకు భారీ షాక్ తగిలిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ లీగ్ దశలో ఓటమెరుగని హర్మన్ సేన తుది పోరులో మాత్రం తడబడింది. ఆతిథ్య ఆస్ట్రేలియా చేతిలో 85 పరుగుల తేడాతో ఘోర ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో మినహా మెగా టోర్నీలో గొప్ప ప్రదర్శన కనబరిచిన భారత మహిళా జట్టుకు సామాజిక మాధ్యమాల్లో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక మాజీ క్రికెటర్లు భారత మహిళా జట్టుకు అండగా నిలిచారు.

ఏదో ఒక రోజు విజేతగా నిలుస్తారు:
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఫైనల్ మ్యాచ్ ఓటమిపై స్పందించారు. టోర్నీలో హర్మన్‌ప్రీత్ సేన బాగా ఆడిందని మెచ్చుకున్నారు. 'అద్భుతంగా ఆడారు. ఏదో ఒక రోజు విజేతగా నిలుస్తారు' అని ప్రశంసించారు. ఈ జట్టును అమితంగా ఇష్టపడతామని గంగూలీ ట్వీట్ చేసారు. 'ఎప్పటికీ అధైర్య పడకండి. మెగా టోర్నీలో అద్భుత ప్రదర్శనన చేసారు. ఏదో ఒక రోజు తప్పక మీరు ప్రపంచకప్‌ను ముద్దాడతారు. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు' అని వెస్టిండీస్ మాజీ క్రికెటర్ వివ్ రిచర్డ్స్ అన్నారు.

ఓటమి వారిని మరింత బలంగా మారుస్తుంది:
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అండగా నిలిచారు. ప్రపంచకప్‌లో భారత జట్టు బాగా పోరాడిందని కోహ్లీ ప్రశంసించారు. ఫైనల్లో ఆతిథ్య జట్టు చేతిలో ఓటమి వారిని మరింత బలంగా మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. 'ప్రపంచకప్‌లో భారత మహిళా జట్టు అద్భుతంగా పోరాడినందుకు ఎంతో గర్వంగా ఉంది. హర్మన్‌సేన తిరిగి పుంజుకుని బలంగా సత్తా చాటుతుందనే నమ్మకం ఉంది' అని ట్వీట్ చేసారు.

కప్పులు వస్తుంటాయి, పోతుంటాయి:
టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ కూడా మహిళా జట్టును కీర్తించారు. 'మహిళల ప్రపంచకప్‌ను వంద కోట్ల కళ్లు వీక్షిస్తాయని కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఎవరూ ఊహించలేదు. కప్పులు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ.. ఈ విజయం సామాజిక అడ్డంకులను, అసమానతలను ఎదిరించిన ప్రతీ భారతీయ అమ్మాయిదీ' అని అన్నారు.

మహిళల క్రికెట్‌ను అందరూ ప్రోత్సహించండి:
'కెప్లెన్ హర్మన్‌ప్రీత్, జట్టు సభ్యులకు అభినందనలు. ప్రపంచకప్‌లో మీ ప్రదర్శన గొప్పగా ఉంది. మహిళల క్రికెట్‌ను అందరూ ప్రోత్సహించండి. తర్వలో మరిన్ని విజయాలు సాధిస్తాం' అని భారత వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ పేర్కొన్నారు. 'ప్రపంచకప్‌ను త్రుటిలో చేజార్చుకుంటే ఆ బాధ ఎంతో కఠినంగా ఉంటుంది. అధైర్య పడకండి. ఫలితం గురించి ఆలోచించకండి. మీరు ఎంతో మందికి ప్రేరణగా నిలిచారు. ప్రపంచకప్‌లో మీ ప్రదర్శన పట్ల ఎంతో గర్వపడుతున్నాం' అని భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ట్వీట్ చేసారు.

ఇది కేవలం ఒక్క దుర్దినం మాత్రమే:
'మన మహిళా జట్టు శాయశక్తులా ప్రయత్నించింది. ఇది కేవలం ఒక్క దుర్దినం మాత్రమే. వారి ఆటను ఎంతో ఆస్వాదించా. భవిష్యత్తులో మరింత గొప్పగా రాణించాలని కోరుకుంటున్నా. టీ20 ప్రపంచకప్ గెలిచిన ఆసీస్‌కు శుభాకాంక్షలు. ఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసారు' అని భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నారు.

రామన్‌కు అభినందనలు:
'ఫైనల్లో భారత్ అద్భుతంగా పోరాడింది. టోర్నీలో మీ ప్రదర్శన బాగుంది. జట్టు గొప్పగా పోరాడటంలో కీలక పాత్ర పోషించిన భారత మహిళా జట్టు కోచ్ రామన్‌కు అభినందనలు. ఫైనల్లో ఆధిపత్యం చెలాయించి ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియాకు శుభాకాంక్షలు' భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ట్వీటారు.

మీ పోరాటాన్ని ఎంతో ఆస్వాదించా:
'టీ20 ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా మహిళా జట్టుకు శుభాకాంక్షలు. ప్రపంచకప్‌లో భారత మహిళా జట్టు పోరాడిన తీరుకి ఎంతో గర్వంగా ఉంది. మెగా టోర్నీలో మీ పోరాటాన్ని ఎంతో ఆస్వాదించా. భవిష్యత్తులో ఇంకా గొప్పగా ఆడాలని కోరుకుంటున్నా' అని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications