Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: ఐపీఎల్ 15 వేదిక‌పై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బాస్‌ సౌర‌వ్ గంగూలీ

Sourav Ganguly said that there is a possibility of hosting IPL 2022 in India

ఈ ఏడాది ఐపీఎల్ ఇండియాలో జ‌ర‌గ‌దెమోన‌ని మ‌ద‌న‌ప‌డుతున్న‌ క్రికెట్ అభిమానుల‌కు బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ గుడ్‌న్యూస్ చెప్పారు. ఈ ఏడాది ఐపీఎల్ మొత్తం టోర్నీని భార‌త్‌లోనే నిర్వ‌హించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఆయ‌న తెలిపారు. క‌రోనా మ‌ర‌ల విజృంభించ‌కుంటే టోర్నీని భార‌త్‌లోనే నిర్వ‌హిస్తామ‌ని గంగూలీ స్ప‌ష్టం చేశారు. గంగూలీ వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం ఐపీఎల్ అభిమానుల‌ను సంతోష‌ప‌రుస్తున్నాయి.

వేదిక‌లు అక్క‌డే

వేదిక‌లు అక్క‌డే

టోర్నీ భార‌త్‌లోనే నిర్వ‌హించినప్ప‌టికీ వేర్వేరు వేదిక‌ల‌లో మ్యాచ్‌లు జ‌రిగే అవ‌కాశం లేద‌ని గంగూలీ తెలిపారు. మ్యాచ్‌ల‌న్నింటినీ మ‌హారాష్ట్రకే ప‌రిమితం చేయ‌నున్న‌ట్లు చెప్పారు. మ‌హారాష్ట్రలోని వాంఖ‌డే, పూణే స్టేడియాల‌లో లీగ్ స్టేజ్ మ్యాచ్‌లను నిర్వ‌హించే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. కాగా నాకౌట్ వేదిక‌ల‌ను త‌ర్వాత నిర్ణ‌యించ‌నున్న‌ట్లు గంగూలీ తెలిపారు. అలాగే ఈ ఏడాది రెండు ద‌శ‌ల్లో జ‌ర‌గ‌నున్న రంజీ ట్రోఫీపై కూడా గంగూలీ స్పందించారు.

 రంజీ ట్రోఫీపై వ్యాఖ్య‌లు

రంజీ ట్రోఫీపై వ్యాఖ్య‌లు

క‌రోనా కార‌ణంగా ఇప్ప‌టికే తాము ఒక సంవ‌త్స‌రం రంజీ ట్రోఫీని నిర్వ‌హించలేక‌పోయామ‌ని గంగూలీ అన్నారు. 2020-2021 రంజీ సీజ‌న్ క‌రోనా కార‌ణంగా జ‌ర‌గ‌లేదు. దేశంలో రంజీ ట్రోఫీ కీల‌క‌మ‌ని, దానిని తాము ప్ర‌తి సంవ‌త్స‌రం నిర్వ‌హించాల‌నుకుంటామ‌ని గంగూలీ చెప్పారు. క‌రోనా ప‌రిస్థితుల్లో ఏదైనా టోర్నీని నిర్వ‌హించ‌డం స‌వాల్‌గా మారింద‌ని ఆయ‌న తెలిపారు. ఇప్ప‌టికే క‌రోనా కార‌ణంగా ప‌లు దేశవాళీ లీగ్‌లు వాయిదా ప‌డిన సంగ‌తిని గంగూలీ గుర్తు చేశారు.

నాకౌట్ మ్యాచ్‌లు అక్క‌డే

నాకౌట్ మ్యాచ్‌లు అక్క‌డే

కాగా గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్ స్టేడియంలో నాకౌట్ మ్యాచ్‌లను నిర్వ‌హించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఈ మేర‌కు బీసీసీఐ అధికారుల మ‌ధ్య చ‌ర్చ‌లు కూడా జ‌రుగుతున్నాయి. ఒక వేళ నాకౌట్ మ్యాచ్‌లు నాటికి క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరిగితే లీగ్‌ను మ‌ళ్లీ విదేశాల‌కు త‌రలించే అవ‌కాశం ఉంది. 2021లో ఆట‌గాళ్ల‌కు క‌రోనా సోక‌డంతో భార‌త్‌లో జ‌రుగుతున్న ఐపీఎల్ 14ను అర్దాంత‌రంగా నిలిపివేశారు. ఎంత‌కీ దేశంలో క‌రోనా కేసులు త‌గ్గ‌క‌పోవ‌డంతో లీగ్‌ను బీసీసీఐ విదేశాల‌కు త‌ర‌లించింది. యూఏఈ వేదిక‌గా మిగ‌తా మ్యాచ్‌ల‌ను నిర్వ‌హించింది. క‌రోనా విజృంభణ కార‌ణంగా 2020 పూర్తి లీగ్‌ను కూడా బీసీసీఐ విదేశాల్లోనే నిర్వ‌హించింది.

Harbhajan Singh: Team India Captain కాలేకపోయా.. BCCI సెలెక్టర్లను నిలదీస్తే ? | Oneindia Telugu
 మొత్తం ఎన్ని మ్యాచ్‌లు

మొత్తం ఎన్ని మ్యాచ్‌లు

ఐపీఎల్‌లో ఇప్ప‌టికే ఉన్న 8 జ‌ట్ల‌కు తోడు ఈ సారి ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌, అహ్మ‌దాబాద్ రూపంలో కొత్త‌గా మ‌రో 2 జ‌ట్లు క‌లిశాయి. దీంతో టోర్నీలో మొత్తం జ‌ట్ల సంఖ్య 10కి చేరింది. కాగా ఈ సారి 10 జ‌ట్లు ఉండ‌డంతో టోర్నీలో 74 మ్యాచ్‌లు ఉండనున్నాయ‌ని స‌మాచారం. గ‌తంలో 60 మ్యాచ్‌ల‌తో టోర్నీ ముగిసేది. ఇప్ప‌టికే 10 ఫాంచైజీలు 33 మంది ఆట‌గాళ్ల‌ను రిటైన్ చేసుకున్నాయి. మ‌రో 590 మంది ఈ నెల 12, 13వ తేదీల‌లో జ‌రిగే మెగా వేలంలో పాల్గొంటున్నారు. వేలానికి మొత్తం 1200 కు పైగా ఆట‌గాళ్లు రిజిష్ట‌ర్ చేసుకోగా బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసి 590 మందితో తుది జాబితాను విడుద‌ల చేసింది.

Story first published: Thursday, February 3, 2022, 16:02 [IST]
Other articles published on Feb 3, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+