For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ పెద్ద స్పెషలేం కాదు.. సౌరవ్ గంగూలీ కామెంట్లు

Sourav Ganguly Said That He Consider India vs Pakistan Match Is a Normal Match

ఆసియా కప్‌లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్.. తన ప్రకారం టోర్నమెంట్‌లో ఓ సాధారణ మ్యాచ్ మాత్రమేనని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తెలిపాడు. ప్రస్తుత భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) ప్రెసిడెంట్‌గా గంగూలీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. తను ఆడే రోజుల్లో కూడా.. టోర్నమెంట్ గెలవడమే లక్ష్యంగా వ్యవహరించేవాళ్లమని.. పాకిస్తాన్‌‌తో మ్యాచ్‌ను టోర్నీలో అన్ని మ్యాచ్‌లలాగే చూసేవాళ్లమని చెప్పాడు.

టోర్నీలో భారత జట్టు రాణిస్తుందని బీసీసీఐ అధ్యక్షుడికి తగినంత నమ్మకముంది. భారత్ మంచి జట్టు అని, ఇటీవలి కాలంలో భారత ప్లేయర్లు చాలా బాగా రాణించారని, ఆసియా కప్‌లో కూడా తమ జట్టు మంచి ప్రదర్శన ఇస్తుందని ఆశిస్తున్నానని తెలిపాడు.

ఇకపోతే సెప్టెంబర్ 16న ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే లెజెండ్స్ క్రికెట్ మ్యాచ్‌లో గంగూలీ కనిపించనున్నాడు. ఇయాన్ మోర్గాన్ సారథ్యంలోని వరల్డ్ ఎలెవన్‌తో తలపడే భారత మహారాజాస్ జట్టుకు బీసీసీఐ అధ్యక్షుడు కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. ఇకపోతే ఈ మ్యాచ్‌లో ప్రేక్షకులు సౌరవ్ గంగూలీ బ్యాట్ నుంచి సిక్సర్లు చూస్తారా అని విలేకరులు గంగూలీని అడగగా ఈ విషయంపై గంగూలీ నవ్వుతూ బదులిచ్చాడు. తాను చాలా కాలంగా టచ్‌కు దూరంగా ఉన్నానని, ఒక్క బంతిని కూడా కనెక్ట్ చేయగలనో లేదో కూడా తెలియదని పేర్కొన్నాడు.

'నేను బ్యాటింగ్ చేస్తాను. కానీ ఏం జరుగుతుందో మాత్రం నాకు తెలియదు. నేను మునుపటిలా కవర్ డ్రైవ్ ఆడగలనని అనుకుంటున్నాను. నేను కేవలం ఒక్క గేమ్ ఆడతాను. గేమ్‌ను ఆస్వాదిస్తాను. ఇది మంచి ఆట. ఈ మ్యాచ్‌లో నేను పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉంది' అని గంగూలీ అన్నాడు. గంగూలీ ఇటీవల ఓ స్పెషల్ మ్యాచ్ కోసం జిమ్‌లో కసరత్తులు చేస్తున్నానని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాను సెప్టెంబర్ 26న ఆడబోయే మ్యాచ్ కోసం ఇప్పటి నుంచి గంగూలీ కసరత్తులు ప్రారంభించాడంటే.. ఈ మ్యాచ్ పట్ల గంగూలీ ఎంతటి ఆసక్తి కనబర్చుతున్నాడో మనం అర్థం చేసుకోవాల్సిందే. ఇక గంగూలీ మరికొద్దీ రోజుల్లో నెట్ ప్రాక్టీస్‌కు దిగనున్నాడు.

Story first published: Monday, August 15, 2022, 21:35 [IST]
Other articles published on Aug 15, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+