బంగ్లా ఆటగాళ్లు భారత సిరీస్‌కు వస్తారు.. కోహ్లీ ఆడుతాడా లేదో అడుగుతా?: గంగూలీ

కోల్‌కతా: సొంతగడ్డపై త్వరలో బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు టీంఇండీయా కెప్టెన్ విరాట్ కోహ్లీ అందుబాటులో ఉంటాడా లేదా అనేది అతడి ఇష్టమే. ఈ విషయంపై గురువారం కోహ్లీతో నేరుగా చర్చిస్తా అని బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. బంగ్లా ఆటగాళ్లు భారత సిరీస్‌కు రావడం ఖాయం అని స్పష్టం చేశాడు. గత కొంత కాలంగా విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న కోహ్లీ.. బంగ్లాదేశ్ టీ20 సిరీస్‌కు విశ్రాంతి తీసుకుంటాడని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గంగూలీ స్పందించారు.

కోహ్లీతో మాట్లాడుతా:
తాజాగా గంగూలీ మాట్లాడుతూ... 'ఈనెల 24న బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో విరాట్ కోహ్లీతో మాట్లాడుతా. బంగ్లాదేశ్‌తో సిరీస్ ఆడుతాడా లేక విరామం తీసుకుంటాడా అనే అంశంపై కూడా చర్చిస్తా. బంగ్లా సిరీస్‌కు విశ్రాంతి తీసుకుంటే.. అది అతడి ఇష్టం. కోహ్లీ భారత జట్టుకు కెప్టెన్. అతడికి గౌరవం ఇవ్వాలి' అని అన్నాడు. అక్టోబర్ 23న బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ బాధ్యతలు చేపట్టనున్నాడన్న సంగతి తెలిసిందే.

ఉమేశ్ అద్భుతాలు చేస్తున్నాడు:
'ఇప్పటికే పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లలో నిరూపించుకున్న రోహిత్ శర్మ.. టెస్టుల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇది జట్టులో పోటీని పెంచుతుంది. రోహిత్ టాప్ బ్యాట్స్‌మన్. అతడు ఏదైనా సాధించగలడు. మ్యాచ్ మలుపుతిప్పే ఆటగాడు. ఉమేశ్ యాదవ్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు. భారత పిచ్‌లపై పెద్దగా బౌన్స్‌ను రాబట్టుకోలేం. అయినా ఉమేశ్ అద్భుతాలు చేస్తున్నాడు. మొహమ్మద్ షమీ, అశ్విన్, జడేజాలు గొప్పగా రాణించారు' అని గంగూలీ పేర్కొన్నాడు.

రెండో టెస్టు మ్యాచ్‌కు బంగ్లా ప్రధాని:
'బంగ్లా ఆటగాళ్లు భారత సిరీస్‌కు రావడం ఖాయం. బంగ్లా ప్రధాని షేక్ హసీనా ఈడెన్ గార్డెన్‌లో గంట మోగించి రెండో టెస్టు మ్యాచ్‌ను ప్రారంభిస్తారు. ఈ మ్యాచ్‌కి భారత ప్రధాని నరేంద్ర మోడీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలకు కూడా ఆహ్వానం పంపించాం' అని గంగూలీ తెలిపాడు.

నవంబర్ 3న తొలి టీ20:
ప్రపంచకప్ నుంచి విరామం లేకుండా క్రికెట్ మ్యాచ్‌లు ఆడుతూ వస్తున్న విరాట్ కోహ్లీపై పనిభారం పడకుండా చూసేందుకు అతడికి విశ్రాంతిని ఇచ్చే అవకాశం ఉందని ఇంతకుముందే సెలెక్షన్ కమిటీలోని ఓ అధికారి ఒకరు తెలిపారు. దీంతో బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లో కోహ్లీ ఆడే అవకాశాలు లేవు. వచ్చే నెలలో బంగ్లాదేశ్‌తో భారత్ మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. నవంబర్ 3న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications