Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోల్‌కతా టెస్టుకు వస్తానని బంగ్లా ప్రధాని మాటిచ్చారు.. ప్రధాని వచ్చాక జట్టెందుకు రాదు: గంగూలీ

Sourav Ganguly said Bangladesh PM Sheikh Hasina Has Given Consent, Dont See How Team Wont

ముంబై: కోల్‌కతా టెస్టుకు వస్తానని బంగ్లా ప్రధాని షేక్‌ హసీనా మాటిచ్చారు. దేశ ప్రధాని వచ్చాక బంగ్లా జట్టు భారత పర్యటనకు ఎందుకు రాదు అని మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అన్నారు. సోమవారం నుండి బంగ్లా ఆటగాళ్లు బంగ్లా క్రికెట్‌ బోర్డు (బీసీబీ)పై జీతభత్యాల విషయంలో సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. క్రికెటర్లు సమ్మెకు దిగడంతో ఈ సిరీస్‌పై సందిగ్ధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో దాదా క్లారిటీ ఇచ్చారు.

బంగ్లా ప్రధాని మాటిచ్చారు

బంగ్లా ప్రధాని మాటిచ్చారు

ముంబైలోని బోర్డు ప్రధాన కార్యాలయంలో బుధవారం బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా గంగూలీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో తొలిసారి మీడియాతో మాట్లాడారు. 'జీతాల విషయంలో బంగ్లా ఆటగాళ్ల, బోర్డు మధ్య జరుగుతున్న అంతర్గత విషయం. కోల్‌కతా టెస్టుకు వస్తానని బంగ్లాదేశ్‌ ప్రధాని మాటిచ్చారు. బంగ్లా ప్రధాని వచ్చాక.. వారి జాతీయ జట్టు ఎందుకు రాదో చూద్దాం' అని గంగూలీ అన్నారు.

 బంగ్లా షెడ్యూల్‌ ప్రకారమే ఆడుతుంది:

బంగ్లా షెడ్యూల్‌ ప్రకారమే ఆడుతుంది:

'బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు భారత సిరీస్‌కు రావడం ఖాయం. బంగ్లా ప్రధాని షేక్‌ హసీనా ఈడెన్‌ గార్డెన్‌లో గంట మోగించి రెండో టెస్టు మ్యాచ్‌ను ప్రారంభిస్తారు. ఈ మ్యాచ్‌కి రావాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీలకు కూడా ఆహ్వానం పంపించాం. వారు కూడా హాజరవుతారు' అని గంగూలీ ఇదివరకే తెలిపిన విషయం తెలిసిందే. షెడ్యూల్‌ ప్రకారమే బంగ్లా ఆడుతుంది అని దాదా ధీమా వ్యక్తం చేశారు.

ఈడెన్‌ గార్డెన్స్‌లో తొలి టెస్ట్:

ఈడెన్‌ గార్డెన్స్‌లో తొలి టెస్ట్:

భారత్‌-బంగ్లాదేశ్‌ల జట్ల మధ్య వచ్చే నెల టెస్ట్‌ సిరీస్‌ ప్రారంభం కానుంది. దీనిలో భాగంగా నవంబర్‌ 22 నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టుకు కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్‌ గార్డెన్స్‌ ఆతిథ్యమివ్వనుంది. ఈ రెండు జట్లు ఈడెన్‌ గార్డెన్స్‌లో తలపడటం ఇదే తొలిసారి. బంగ్లాదేశ్‌కు తొలి టెస్టు కావడంతో.. ఈ టెస్టును వీక్షించాల్సిందింగా భారత, బంగ్లా ప్రధానులకు క్యాబ్‌ నుండి ఆహ్వానం అందింది.

 నవంబర్‌ 3న తొలి టీ20:

నవంబర్‌ 3న తొలి టీ20:

భారత్-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య 3 టీ-20 మ్యాచ్‌లు, 2 టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. నవంబర్‌ 3న ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో మొదటి టీ20 మ్యాచ్‌తో పర్యటన ఆరంభమవుతుంది. ఆ తర్వాత టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా 2 మ్యాచులు ఆడాలి. బంగ్లా క్రికెటర్లు రాకుంటే నిబంధనల ప్రకారం 120 పాయింట్లు భారత్‌కు లభిస్తాయి.

Story first published: Thursday, October 24, 2019, 9:41 [IST]
Other articles published on Oct 24, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+