
సూపర్ సిరీస్ ప్రతిపాదన
సూపర్ సిరీస్ నిర్వహనలో భాగంగా దాదా మొదటగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)తో చర్చలు జరిపాడు. ఈసీబీ అందుకు సుముఖంగా ఉందని తెలుస్తోంది. అయితే టోర్నీ నిర్వహణపై ఇంగ్లాండ్ బోర్డు ఇతర ఐసీసీ జట్లతో చర్చిచిస్తామని చెప్పింది. మరోవైపు గంగూలీ తీసుకొచ్చిన సూపర్ సిరీస్ ప్రతిపాదన విఫలమౌతుందని పాక్ మాజీ క్రికెటర్ రషిద్ లతిఫ్ అంటున్నాడు.

గంగూలీ ప్రతిపాదన ఫ్లాప్ అవుతుంది
తాజాగా రషిద్ లతిఫ్ యూట్యూబ్‌లో మాట్లాడుతూ... 'ఆ నాలుగు జట్లు మాత్రమే సూపర్ సిరీస్ ఆడాలని చూస్తే ఇతర ఐసీసీ సభ్యత్వ దేశాలను విస్మరించినట్టే. ఇది క్రికెట్ ఆటకు ఏ మాత్రం మంచిది కాదు. కొద్ది సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టి విఫలమైన 'బిగ్ త్రీ మోడల్' లాగే.. ఈ సూపర్ సిరీస్ కూడా కచ్చితంగా ఫ్లాప్ అవుతుందని అనుకుంటున్నా. దాదా ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది' అని పేర్కొన్నాడు.

మేం సిద్ధం:
ఈసీబీ ఉన్నతాధికారి ఒకరు సూపర్ సిరీస్ విషయంపై మాట్లాడాడు. 'మా ఆటపై ప్రభావం చూపే విషయాలను చర్చించడానికి మేం ఎప్పుడూ పెద్ద జట్ల బోర్డులతో సమావేశమవుతాం. తాజాగా బీసీసీఐతో జరిగిన సమావేశంలో నాలుగు మెగా జట్ల టోర్నీ నిర్వహించాలనే ప్రతిపాదన వచ్చింది. అయితే ఈ టోర్నీ నిర్వహణపై ఇతర ఐసీసీ జట్లతో చర్చించడానికి మేం సిద్ధంగా ఉన్నాం' అని అన్నాడు.

ఆర్థికంగా లాభపడే అవకాశం:
ఒకవేళ ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే ఆయా క్రికెట్ బోర్డులు ఆర్థికంగా లాభపడే అవకాశముంది. అయితే ఐసీసీ మూడు దేశాలకు మించి టోర్నీలు నిర్వహించడానికి అనుమతించదు. మరోవైపు నాలుగు దేశాల టోర్నీపై భారత్, ఇంగ్లాండ్ ఇప్పటికే సుముఖత వ్యక్తం చేశాయి. ఇక ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు మాత్రమే తమ నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications












