Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫెంటాస్టిక్‌: లార్డ్స్ బాల్కనీలో షర్ట్ విప్పడంపై గంగూలీ భార్య డోనా

Sourav Ganguly's shirt-waving at Lord's was a fantastic gesture, says Dona

హైదరాబాద్: భారత్ క్రికెట్ చరిత్రతో ఆ రోజుకు ఎంతో ప్రత్యేకత ఉంది. 2002 జూలై 13న గంగూలీ నేతృత్వంలోని టీమిండియా లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో అప్పడే అంతర్జాతీయ క్రికెట్‌‌లోకి అరంగేట్రం చేసిన యువరాజ్‌ సింగ్‌, మహమ్మద్‌ కైఫ్‌ అద్భుత ప్రదర్శన చేశారు.

నాట్‌వెస్ట్‌ సిరీస్‌ ఫైనల్లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ నిర్దేశించిన 326 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి.. చరిత్రాత్మకమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ విజయానందంలో ఉప్పొంగి పోయిన ఆ జట్టు కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ.. ఎవరూ ఊహించనిరీతిలో చొక్కావిప్పి గాల్లోకి ఎగరేస్తూ లార్డ్స్ బాల్కనీలో సంబరాలు చేసుకున్నాడు.

ఈ ఘటన జరిగిన తర్వాత గంగూలీ ఎన్నోసార్లు దానిపై స్పందించాడు. అది అసంకల్పితంగా చేసిన చర్యగా గంగూలీ వివరణ ఇచ్చారు. తాజాగా ఇండియా టుడే కాన్‌క్లేవ్ ఈస్ట్‌ 2017 సదస్సులో గంగూలీ భార్య డొనా కూడా ఆనాటి సంఘటనపై స్పందించారు. గంగూలీ ఆనాడు చేసిన చర్య ఫెంటాస్టిక్‌ ఆమె కితాబిచ్చారు.

ఆ తర్వాత గంగూలీ మాట్లాడుతూ 'అలా ఇప్పుడు చేయలేను. ప్రతిసారీ స్పోర్ట్స్‌ చానెల్‌లో ఆ దృశ్యాన్ని చూపిస్తారు. నేను ఓసారి టీవీ ఎడిటర్‌కు ఫోన్‌చేసి.. నేను 20వేల అంతర్జాతీయ పరుగుల చేశాను. అది చూపించవచ్చు కదా అంటే.. అది చెప్పడానికే ఈ దృశ్యాన్ని వేస్తున్నట్టు చెప్పారు' అని అన్నాడు.

'ఎంతో సంతృప్తితో నేను అలా చేశాను. హానర్‌ బోర్డు మీద నా పేరు (లార్డ్స్‌ మైదానంలో గంగూలీ తొలి టెస్టు సెంచరీ సాధించాడు) ఉన్న సంగతి మర్చిపోకూడదు. అది ఎప్పటికీ నాకు స్పెషల్‌గా మిలిగిపోతుంది' అని గంగూలీ చెప్పడం విశేషం. 2008లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన గంగూలీ ప్రస్తుతం క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (కోల్‌కతా) అధ్యక్షుడిగా ఉన్నారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, November 24, 2017, 21:23 [IST]
Other articles published on Nov 24, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+