Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇన్‌స్టాలో గంగూలీ పోస్ట్.. ట్రోల్ చేసిన సనా!!

Sourav Gangulys Post Invites Hilarious Comments From Daughter Sana

కోల్‌కతా: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, కూతురు సనా గంగూలీల మధ్య మరోసారి ఆసక్తికర సంభాషణ సాగింది. భారత మాజీ కెప్టెన్ గంగూలీ ఆదివారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫొటో పోస్టు చేయగా.. సనా ట్రోలింగ్‌ చేసింది. గంగూలీని సనా ట్రోల్ చేయడం ఇది తొలిసారి ఏం కాదు. గతంలో కూడా ఓసారి ట్రోల్ చేసింది. విషయంలోకి వెళితే.

 గంగూలీని మరోసారి ట్రోల్‌ చేసిన సనా

గంగూలీని మరోసారి ట్రోల్‌ చేసిన సనా

'ఆదివారం పనిచేయడం అస్సలు నచ్చదు' అని గంగూలీ ఆదివారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో పోస్టు చేసాడు. ఏ పోస్టుకు సనా వెంటనే స్పందించింది. 'పని చేయకుండా 12 గంటల వరకు బెడ్‌ మీద ఎవరు ఉంటారో చెప్పండి' అని ట్రోల్ చేసింది. సనా నవంబర్‌లో గంగూలీని తొలిసారి ట్రోల్‌ చేసింది. భారత్‌-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య ఈడెన్‌ గార్డెన్స్‌లో తొలి డే/నైట్‌ టెస్టు నిర్వహించారు. మ్యాచ్‌ అనంతరం కెప్టెన్ విరాట్‌ కోహ్లీకి ట్రోఫీ అందించేటప్పుడు దిగిన ఓ చిత్రాన్ని దాదా ఇన్‌స్టాలో పంచుకున్నారు.

సీరియస్‌ లుక్‌లో దాదా

సీరియస్‌ లుక్‌లో దాదా

ఆ పోస్టులో గంగూలీ కాస్త సీరియస్‌ లుక్‌లో కనిపించడంతో.. ఆయన కుమార్తె సనా సరదాగా ట్రోల్‌ చేసింది. 'మీకు నచ్చనిది ఏంటి?' అని అడిగింది. దీనికి గంగూలీ ఫన్నీగా రిప్లే ఇచ్చారు. 'నువ్వు.. నాపై అవిధేయత చూపిస్తున్నావా' అని బదులిచ్చారు. మళ్లీ దానికి సనా మరో కామెంట్‌ యాడ్‌ చేసింది. 'అది మీ నుంచే నేర్చుకుంటున్నా' అంటూ నవ్వుతున్న ఎమోజీని పోస్ట్‌ చేసింది.

పౌరసత్వ చట్టంపై పోస్ట్

పౌరసత్వ చట్టంపై పోస్ట్

సనా ఇటీవలే పౌరసత్వ చట్టంపై ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఒక పోస్టు పెట్టి వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ప్రముఖ రచయిత కుశ్వంత్‌ సింగ్‌ రచించిన 'ది ఎండ్‌ ఆఫ్‌ ఇండియా' అనే పుస్తకంలోని ఓ సందేశాన్ని సనా ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. దీనిపై చాలా విమర్శలు వచ్చాయి. 'సనాను ఇలాంటి వాటికి దూరంగా ఉంచాలి. ఆమె పోస్టు పెట్టిన విషయం వాస్తవం కాదు, ఆమె చాలా చిన్న అమ్మాయి. తనకు రాజకీయాలు తెలియవు' అంటూ గంగూలీ ట్వీట్ చేశారు.

సూపర్‌ సిరీస్‌ నిర్వహణలో బిజీ

బీసీసీఐ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న గంగూలీ తీరిక లేకుండా పని చేస్తున్నారు. బీసీసీఐలో పలు సంస్కరణలు తేచ్చేందుకు కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తొలి పింక్‌ బాల్‌ టెస్టు నిర్వహించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఇక ఇప్పుడు నాలుగు పెద్ద జట్లతో కలిసి 'సూపర్‌ సిరీస్‌' నిర్వహించాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇప్పటికే ఇంగ్లండ్ బోర్డుతో చర్చలు జరిపాడు.

Story first published: Monday, December 30, 2019, 13:01 [IST]
Other articles published on Dec 30, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+