ఎన్నిక లాంఛనమే: గంగూలీ నామినేషన్ ధృవీకరించిన బీసీసీఐ ఎన్నికల అధికారి

హైదరాబాద్: బీసీసీఐ అధ్యక్ష పదవికి టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సోమవారం నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి సోమవారం చివరిరోజు కావడంతో మంగళవారం అన్ని నామినేషన్లు బీసీసీఐ ఎన్నికల అధికారి ఎన్ గోపాలస్వామి ధృవీకరించారు.
అధ్యక్ష బరిలో గంగూలీ ఒక్కడే పోటీ చేస్తుండటంతో అతడి ఎన్నిక లాంఛనమే. మరోవైపు నామినేషన్లలో ఉపసంహరణలు లేనందున ఉన్నత ఉద్యోగాలకు సంబధించిన నామినేషన్ల తుది జాబితాను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) బుధవారం విడుదల చేయనుంది.

అనూహ్యంగా తెరపైకి గంగూలీ పేరు
ఆదివారం రాత్రి నాటకీయ పరిణామాల మధ్య దేశంలోని అన్ని క్రికెట్ సంఘాలకూ ఆమోద యోగ్యమైన అభ్యర్థిగా సౌరవ్ గంగూలీ మారండతో సోమవారం బోర్డు అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్‌లో క్యాబ్ అధ్యక్షుడి హోదాలో తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.

గంగూలీ తప్ప
బీసీసీఐ అధ్యక్ష పదవికి ఇంకెవ్వరూ నామినేషన్ వేయలేదు. అక్టోబర్ 23న గంగూలీ ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించనున్నారు. ఆదివారం ఉదయం వరకు బ్రిజేష్ పటేల్ అధ్యక్షుడు పదవికి ముందు వరుసలో ఉన్నాడు. అయితే, కొన్ని గంటల్లోనే పరిస్థితులు వేగంగా మారిపోయాయి. అనూహ్యంగా తెరపైకి గంగూలీ పేరు వచ్చింది.

ఎన్నిక ఏకగ్రీవమే
ఒక్క రోజు తిరిగేసరికి బోర్డు అధ్యక్షుడిగా అతడి ఎన్నిక ఏకగ్రీవం అయిపోయింది. ఇక, గంగూలీతో పాటు కార్యదర్శి పదవికి జై షా (కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనయుడు) నామినేషన్ సమర్పించగా... మహిమ్ వర్మ (ఉపాధ్యక్షుడు), అరుణ్ సింగ్ ధూమల్ (ట్రెజరర్), బ్రిజేష్ పటేల్ (ఐపీఎల్ ఛైర్మన్) నామినేషన్ పత్రాలు సమర్పించారు.

ధృవీకరించిన బీసీసీఐ ఎన్నికల అధికారి
వీరితో పాటు జయేష్ జార్జ్ (జాయింట్ సెక్రటరీ), ఖైరుల్ మజుందార్ (కౌన్సిలర్), ప్రభ్‌జ్యోత్ సింగ్ (కౌన్సిలర్) కూడా నామినేషన్లు వేశారు. వీళ్లందరి ఎన్నిక కూడా ఏకగ్రీవమేనని తెలుస్తోంది. బీసీసీఐ ఎన్నికల అధికారి ఎన్ గోపాలస్వామి పరిశీలన తర్వాత ఈ కింది పోస్టులకు నామినేషన్లు ధృవీకరించబడ్డాయి.
రేసులో ఉన్నది వీరే
* అధ్యక్షుడు - సౌరవ్ గంగూలీ
* ఉపాధ్యక్షుడు - మహిమ్ వర్మ
* కార్యదర్శి - జే అమిత్‌భాయ్ షా
* జాయింట్ సెక్రటరీ - జయేష్ జార్జ్
* కోశాధికారి - అరుణ్ సింగ్ ధుమల్
* కౌన్సిలర్ - ప్రభుతేజ్ సింగ్ భాటియా
* ఐపీఎల్ పాలక మండలి సభ్యుడు - బ్రిజేష్ పర్సురం పటేల్
* పాలక మండలి సభ్యుడు - ఎం ఖైరుల్ జమాల్ మజుందార్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications