Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సౌరవ్ గంగూలీ తొలి కోచ్​ ​మృతి!!

Sourav Ganguly’s childhood coach Ashok Mustafi dies

కోల్‌క‌తా: టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్య‌క్షుడు సౌరవ్ గంగూలీ చిన్ననాటి కోచ్ అశోక్ ముస్తఫీ కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అశోక్ ముస్తఫీ గురువారం ఉదయం మృతి చెందారు. గుండె సంబంధిత వ్యాధి కారణంగా ఆయన ఏప్రిల్​ నుంచి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఉదయం కార్డియాక్ అరెస్ట్​కు గురికావడంతో తుదిశ్వాస విడిచారని ముస్తఫీ కుటుంబ సభ్యులు తెలిపారు.

అశోక్ ముస్తఫీ తన కూతురితో పాటు లండన్​లో ఉండేవారు. 'అశోక్ ముస్తఫీ గుండె సంబంధిత వ్యాధి కారణంగా ఏప్రిల్​ నుంచి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఉదయం కార్డియాక్ అరెస్ట్​కు గురికావడంతో తుదిశ్వాస విడిచారు' అని ముస్తఫీ కుటుంబ సభ్యులొకరు మీడియా సమావేశంలో తెలిపారు. పలువురు మాజీ, ప్రస్తుత భారత క్రికెటర్లు ముస్తఫీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

బెంగాల్​కు క్రికెట్ పాఠాలు నేర్పినదిగా పేరున్న 'దుఖీరామ్ క్రికెట్ కోచింగ్ సెంటర్'​లో అశోక్​ ముస్తాఫీ ప్రముఖ కోచ్​గా ఉండేవారు. ఆయన వద్ద శిక్షణ తీసుకున్న 12మంది బెంగాల్​ రంజీ క్రికెటర్లుగా ఎదిగారు. సౌర‌వ్ గంగూలీ చిన్నతనంలో తొలిసారిగా ముస్తాఫీ వద్దే క్రికెట్​లో ఓనమాలు దిద్దాడు. దాదా స్నేహితుడు సంజయ్ దాస్ కూడా ఆయన వద్దే క్రికెట్ ప్రారంభించాడు. గంగూలీ టీమ్​భారత కెప్టెన్​గా అదరగొట్టి, ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్ష పదవిలో ఉన్నాడు. గత నెల అశోక్ ముస్తాఫీ ఆరోగ్యం క్షీణించగా.. వైద్యానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను గంగూలీ, సంజయ్ దగ్గరుండి చూసుకున్నారు.

Story first published: Thursday, July 30, 2020, 20:17 [IST]
Other articles published on Jul 30, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+