క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్.. వైరల్‌గా గంగూలీ సెల్ఫీ!!

బెంగళూరు: ఇటీవలే బీసీసీఐ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన సౌరవ్ గంగూలీ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. గంగూలీ తాను అనుకున్న పనులన్నీ రాకెట్ వేగంతో పూర్తిచేస్తున్నారు. మొదటగా దేశవాళీ ఆటగాళ్ల ప్రయోజనాలపై దృష్టి సారించిన దాదా.. ఆ తర్వాత డేనైట్ టెస్ట్ మ్యాచ్ గురించి కెప్టెన్ విరాట్ కోహ్లీతో చర్చించాడు. ఆపై స్వయంగా బంగ్లా క్రికెట్ బోర్డుకు లేఖ రాయడంతో పాటు వారితో డే నైట్ టెస్టుకు ఓకే అనిపించాడు. దీంతో టీమిండియా తొలి డే నైట్ టెస్ట్ ఆడేందుకు సిద్దమయింది.

ద్రవిడ్‌తో భేటీ
అనంతరం బెంగళూరులో కొత్తగా నిర్మించాల్సిన జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ), దాని అభివృద్ధి ప్రణాళికపై దాదా దృష్టి సారించారు. ఈ క్రమంలోనే చిన్నస్వామి స్టేడియంలో ఎన్‌సీఏ చీఫ్ రాహుల్ ద్రవిడ్‌తో దాదా బుధవారం భేటీ అయ్యారు. అకాడమీ అభివృద్ధి, మౌలిక వసతులపై ఇద్దరు చర్చించారు. ఈ సమావేశంలో ఎన్‌సీఏలోని ఇతర అధికారులూ పాల్గొన్నారు. సమావేశం తర్వాత అందరూ కలిసి కొత్తగా ఎన్‌సీఏను నిర్మించాల్సిన స్థలాన్ని పరిశీలించారు.

విమానాశ్రయంలో గంగూలీ
సమావేశం అనంతరం గంగూలీ బెంగళూరు విమానాశ్రయంలో ఉండగా.. అతన్ని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఇది గమనించిన దాదా.. విమానాశ్రయంలోని చెకింగ్ పాయింట్ వద్ద అభిమానులు, భద్రతా సిబ్బందితో సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం కొంత మందికి కరచనలం చేసి వెళ్లిపోయారు. దీంతో విమానాశ్రయంలోని అభిమానులు సంతోషం వ్యక్తం చేసారు.

అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు
అభిమానులతో సెల్ఫీ తీసుకొన్న ఫొటోని గంగూలీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 'బెంగళూరు విమానాశ్రయంలో చెకింగ్ పాయింట్ వద్ద. అభిమానులు నాపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు. చాలా ఆనందంగా ఉంది' అని దాదా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్లు చేస్తున్నారు.

క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్
'దాదా.. బెంగుళూరులో మీకు ఎంత క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మీకు తెలియదు' అని ఓ అభిమాని కామెంట్ చేశారు. 'దాదా.. భారత క్రికెట్ కోసం పని చేస్తూ ఉండండి. మీరు పదవిలో ఉన్నంతకాలం ఎలా పని చేయాలో అందరికీ చూపించండి. మేమంతా నిన్ను ప్రేమిస్తున్నాం. మీతోనే ఉంటాం' అని ఇంకో అభిమాని కామెంట్ చేసాడు. 'వావ్.. చెకిన్ కౌంటర్లో విలేకరుల సమావేశంలా ఉంది', 'బెంగళూరులో ద్రవిడ్‌ను కలిసిన తరువాత దాదా' అని కామెంట్స్ చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications