సచిన్ నాకు వార్నింగ్ ఇచ్చాడు: గంగూలీ

న్యూఢిల్లీ: క్రికెట్ బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ క్రికెటర్‌గా కొనసాగిన సమయంలో మైదానం వెలుపల ఎంత సరదాగా ఉన్నా.. బరిలోకి దిగాక మాత్రం ఆటపై ఎంతో ఏకాగ్రత చూపించేవాడు. ఇక క్రికెట్ ఆడిన రోజుల్లో ఎప్పుడైనా సచిన్‌లో కోపం చూసిన క్షణాలు చాలా అరుదు. ఎటువంటి వివాదాలు, హెచ్చరికలు లేకుండానే సచిన్ తన క్రీడా జీవితాన్ని ముగించాడు. అయితే సచిన్ టెండూల్కర్ ఆగ్రహాన్ని తాను చూశానని ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అంటున్నాడు.

1997 వెస్టిండీస్ పర్యటనలో:
భారత జట్టుకు సచిన్ టెండూల్కర్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో కోప్పడటమే కాకుండా తనకు వార్నింగ్ కూడా ఇచ్చాడని సౌరవ్ గంగూలీ గుర్తు చేసుకున్నాడు. 1997 వెస్టిండీస్ పర్యటనలో సచిన్ ఆగ్రహానికి బీసీసీఐ బాస్ గంగూలీ బలయ్యాడట. ఆ పర్యటనకు వెళ్లిన సమయంలో భారత్ గెలవాల్సిన ఒక టెస్టు మ్యాచ్‌ను కోల్పోవడంతో గంగూలీపై ఆగ్రహం వ్యక్తం చేశాడట సచిన్. ఇటీవల సచిన్ టెండూల్కర్ 48వ ఒడిలోకి అడుగుపెట్టిన సందర్భంలో అతనితో ఉన్న కొన్ని జ్ఞాపకాలను దాదా షేర్ చేసుకున్నాడు.

ఆలౌట్ అయ్యాం:
'ఐదు టెస్టుల సిరీస్‌ను అప్పుడు భారత జట్టు 0-1తో ఓడిపోయింది. వాస్తవానికి మూడో టెస్టులో విండీస్‌కు దక్కిన ఆ విజయం భారత్ ఖాతాలో పడాల్సింది. మూడో టెస్టులో విండీస్ మాకు 120 పరుగుల టార్గెట్‌ను మాత్రమే నిర్దేశించింది. ఇది చాలా స్పల్ప లక్ష్యం. కానీ మేము 81 పరుగులకే రెండో ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయ్యాం. దాంతో గెలవాల్సిన మ్యాచ్‌ను ఓడిపోయాం. ఫలితంగా సిరీస్‌ను విండీస్ గెలుచుకుంది' అని సౌరవ్ గంగూలీ తెలిపాడు.

సచిన్ నాకు వార్నింగ్ ఇచ్చాడు:
'అప్పటికి భారత జట్టు విండీస్ గడ్డపై సిరీస్ గెలవక 11 ఏళ్లైంది. దీంతో సువర్ణావకాశం చేజారిందన్న ఆవేదనలో కెప్టెన్‌గా ఉన్న సచిన్ తొలిసారిగా డ్రెస్సింగ్ రూమ్‌లో విలపించాడు. ఆ క్రమంలోనే సచిన్ తన కోపాన్ని నాపై చూపాడు. ప్రతీ రోజూ మైదానం చుట్టూ పరుగెత్తితేనే భవిష్యత్తు ఉంటుందని హెచ్చరించాడు. నువ్వు జట్టులో చోటు నిలబెట్టుకోవాలంటే.. రోజూ ఉదయమే పరుగెత్తాల్సిందే అని వార్నింగ్ ఇచ్చాడు. కెప్టెన్‌గా అవసరమైనప్పుడు సహచరులను మందలించడంలో తప్పు లేదు' అని దాదా చెప్పాడు.

సచిన్ ఆటను గమనిస్తూ పెరిగా:
14 ఏళ్ల వయస్సు నుంచే తాను సచిన్ ఆటను గమనిస్తూ పెరిగానని సౌరవ్ గంగూలీ తెలిపాడు. ఆ తర్వాత టీమిండియా తరఫున అరంగేట్రం చేశాక సచిన్‌తో కలిసి ఓపెనర్‌గా ఆడడంతో పాటు తమ జోడీ ఎన్నో విజయాలు అందించిందని దాదా గుర్తు చేశాడు. తదనంతరం 2000లో జట్టు పగ్గాలు చేపట్టిన గంగూలీ అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు. భారత క్రికెట్‌ను ఓ ఎత్తుకు తీసుకెళ్లాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications