Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా కోచ్‌గా పాంటింగ్.. రూమర్లపై స్పందించిన గంగూలీ

Sourav Ganguly Responds To Rumours Of Ricky Ponting Becoming India Coach || Oneindia Telugu
Sourav Ganguly responds to rumours of Ricky Ponting becoming India coach

ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ టీమిండియా కోచ్‌గా నియమితులవుతారని వస్తున్న వార్తలపై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2019 సీజన్‌లో రికీ పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహారిస్తుండగా.. సౌరవ్ గంగూలీ సలహాదారుగా ఉన్నారు. వీరి ఇద్దరి సమక్షంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్-12లో దూసుకెళుతోంది.

కుర్రాళ్ళు ఎంతో నేర్చుకుంటున్నారు:

కుర్రాళ్ళు ఎంతో నేర్చుకుంటున్నారు:

పాంటింగ్, గుంగూలీలు ఇద్దరు ఢిల్లీ ఆటగాళ్లకు విలువైన సలహాలిస్తూ ప్రోత్సహిస్తున్నారు. వీరి మెలకువలతో యువ ఆటగాళ్లు పంత్, శ్రేయాస్ అయ్యర్, పృద్విషా, మోరిస్, రబాడలు అద్భుతంగా రాణిస్తున్నారు. వారి నుంచి ఎంతో నేర్చుకుంటున్నానని టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ తెలిపాడు. వీరి సమక్షంలో ఢిల్లీ ఆటగాళ్లు అద్భుతంగా ఆడి పాయింట్ల పట్టికలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఢిల్లీ ఆటగాళ్లు ఇంతలా రాణించడానికి కారణం మాత్రం రికీ పాంటింగ్.

వరల్డ్‌కప్‌ అనంతరం పదవీకాలం ముగుస్తుంది:

వరల్డ్‌కప్‌ అనంతరం పదవీకాలం ముగుస్తుంది:

వరల్డ్‌కప్‌ అనంతరం టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రి పదవీకాలం ముగుస్తుంది. వెంటనే కొత్త కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2019 సీజన్‌లో హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయపథంలో నడిపిస్తుండడంతో.. భారత అభిమానులు టీమిండియా కోచ్‌గా పాంటింగ్ ను నియమించాలని అంటున్నారు. తాజాగా ఈ వార్తలపై సౌరవ్ గుంగూలీ స్పందించారు.

కోచ్‌గా సరైన వ్యక్తే:

కోచ్‌గా సరైన వ్యక్తే:

'ముందుగా పాంటింగ్‌ను అడగండి.. ఒక సంవత్సరంలో 8-9 నెలలు ఇంటికి దూరంగా ఉండాలి. అందుకు పాంటింగ్‌ సిద్ధంగా ఉంటే.. అతడు టీమిండియా కోచ్‌గా సరైన వ్యక్తే' అని గుంగూలీ అన్నారు. 'మేము మంచి స్నేహితులం. ఒక సమయంలో మైదానంలో ఇద్దరం విరోధులుగా ఇండేవాళ్ళం. గడిచిన సంవత్సరాలలో మా స్నేహం పెరిగింది. కుర్రాళ్లతో ఢిల్లీ జట్టుకు మంచి విజయాలు అందిస్తున్నాడు' అని గుంగూలీ పేర్కొన్నారు.

Story first published: Wednesday, May 1, 2019, 16:35 [IST]
Other articles published on May 1, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+