Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ విజయాలను మర్చిపోయావా!: శాస్త్రికి గంగూలీ చురక

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రధాన కోచ్ రవిశాస్త్రికి చురకలంటించాడు. దిగ్గజ ఆటగాళ్లతో కూడిన భారత జట్టుకు సాధ్యం కాని విజయాలను కోహ్లీ నేతృత్వంలోని జట్టు సాధించిందని గాలే టెస్టు విజయం అనంతరం కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

రవిశాస్త్రి వ్యాఖ్యలపై తాజాగా సౌరవ్ గంగూలీ స్పందించాడు. ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌పై భారత జట్టు సాధించిన విజయాలను శాస్త్రి మర్చిపోయాడని గంగూలీ అన్నాడు. రవిశాస్త్రి కోచింగ్ భారత క్రికెట్ ను మరింత ముందుకు తీసుకెళ్లుతుందని ఆశిస్తున్నానని గంగూలీ తెలిపాడు.

కాగా, తన కెప్టెన్సీలో టీమిండియా సాధించిన విజయాలను గంగూలీ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. తన నేతృత్వంలో భారత జట్టు.. పాకిస్తాన్ లో ఆ జట్టుపై 15 ఏళ్ల తరువాత సిరీస్ ను గెలిచిన విషయాన్ని పేర్కొన్నాడు. మరొకవైపు 2007లో ఇంగ్లండ్ లో ఆ జట్టుపై సాధించిన విజయాన్ని కూడా గంగూలీ ప్రస్తావించాడు.

రవిశాస్త్రి వ్యాఖ్యలపై మాట్లాడదలచుకోలేదు

రవిశాస్త్రి వ్యాఖ్యలపై మాట్లాడదలచుకోలేదు

‘నిజంగా చెప్పాలంటే రవిశాస్త్రి వ్యాఖ్యలపై నేను మాట్లాడదలచుకోలేదు. గంగూలీ, సచిన్‌, లక్ష్మణ్‌తో కూడిన క్రికెట్‌ సలహా కమిటీ అతనికి మంచి ఉద్యోగం ఇచ్చింది. దానిని సద్వినియోగం చేసుకుని 2019 వరల్డ్ టోర్నీ వరకు కోచ్‌ పదవిలో కొనసాగి భారత్‌కు ట్రోఫీ అందించేలా కృషి చేయాలని కోరుకుంటున్నా. 2007లో ఇంగ్లాండ్‌పై విజయం సాధించాం. పాక్‌ను చిత్తు చేశాం. దయచేసి ఒకదానితో మరొకటి పోల్చొద్దు. భవిష్యత్తులో కోహ్లీ సేన మరిన్ని విజయాలు అందుకునేలా నీ సేవలు అందించు' అని గంగూలీ అన్నాడు.

 గంగూలీ, రవిశాస్త్రిల మధ్య మాటల యుద్ధం

గంగూలీ, రవిశాస్త్రిల మధ్య మాటల యుద్ధం

గతేడాది అనిల్ కుంబ్లేను కోచ్‌గా ఎంపిక చేసిన సమయంలో గంగూలీ, రవిశాస్త్రిల మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో తనకు కోచ్ పదవి రాకపోవడానికి గంగూలీనే కారణమంటూ రవిశాస్త్రి బహిరంగంగానే విమర్శించిన సంగతి తెలిసిందే. దానికి అప్పట్లో గంగూలీ కూడా దీటుగానే బదులిచ్చాడు.

రవిశాస్త్రిని టీమిండియా ప్రధాన కోచ్‌గా

రవిశాస్త్రిని టీమిండియా ప్రధాన కోచ్‌గా

కోచ్‌గా అనిల్ కుంబ్లే పదవీ కాలం ముగియడంతో ఇటీవల రవిశాస్త్రిని టీమిండియా ప్రధాన కోచ్‌గా సచిన్, గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ రవిశాస్త్రిని కోచ్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే గాలే టెస్టు విజయం తర్వాత ఆనంద్ బజార్ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో గ‌తంలో ఏ భారత జట్టుకి సాధ్యం కాని ఘ‌న‌త‌ల‌ను సాధించే స‌త్తా ఇప్ప‌టి జట్టుకు ఉందని శాస్త్రి చెప్పాడు.

ఎవ‌రికీ ఈ ఘ‌న‌త సాధ్యం కాలేద‌ు

ఎవ‌రికీ ఈ ఘ‌న‌త సాధ్యం కాలేద‌ు

గత రెండేళ్లుగా ఇదే జట్టు కలిసి ఆడుతోందని, మంచి ఫలితాలను సాధించడానికి ఇది బాగా కలిసొస్తుందని శాస్త్రి చెప్పాడు. 22 ఏళ్ల త‌ర్వాత 2015లో ఇదే జట్టు శ్రీలంక‌లో 2-1తో టెస్టు సిరీస్ గెలిచిన విష‌యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. గ‌త రెండు ద‌శాబ్దాల‌లో ఎంతోమంది గొప్ప క్రికెట‌ర్లు భారత జట్టులో ఉన్నప్పటికీ, ఎవ‌రికీ ఈ ఘ‌న‌త సాధ్యం కాలేద‌ని అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+