బీసీసీఐ కాంట్రాక్టు నుంచి ధోనీని తప్పించడంపై సౌరవ్ గంగూలీ ఏమన్నాడో తెలుసా?

హైదరాబాద్: వార్షిక కాంట్రాక్టుల జాబితా నుంచి వరల్డ్‌కప్ విన్నింగ్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరుని తప్పించడంపై మాట్లాడేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శుక్రవారం నిరాకరించాడు. 2019 అక్టోబరు నుంచి 2020 సెప్టెంబర్ మధ్య కాలానికి బీసీసీఐ ఇటీవలే ఆటగాళ్ల కాంట్రాక్టు జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ జాబితాలో ధోని పేరు లేదు. దీంతో ధోని కెరీర్ ముగిసినట్టేనని, అతను రీఎంట్రీ ఇచ్చే అవకాశమే లేదంటూ ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కోల్‌కతాలో ఓ కార్యక్రమానికి హాజరైన సౌరవ్ గంగూలీని దీనిపై స్పందించాల్సిందిగా విలేకరులు కోరగా దాదా సున్నితంగా ''దీనిపై నేను వ్యాఖ్యానించలేను'' అని అన్నాడు.

ధోనితో చర్చించిన తర్వాతే
అయితే, కాంట్రాక్టుల విషయాన్ని లెజండరీ క్రికెటర్‌తో చర్చించే ఈ నిర్ణయం తీసుకున్నామని ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపారు. 'బీసీసీఐ ఆఫీస్ బేరర్లలో అత్యంత కీలకమైన ఓ వ్యక్తి ధోనితో కాంట్రాక్టుల విషయంపై చర్చించారు. సెప్టెంబర్ 2019 నుంచి ప్రస్తుత టైమ్ వరకు ఎలాంటి క్రికెట్ ఆడనందున కాంట్రాక్టు ఇవ్వడం కుదరదని ధోనికి స్పష్టంగా వివరించారు' అని ఆయన చెప్పారు.

గతేడాది ఎ గ్రేడ్‌లో ఉన్న ధోని
గతేడాది ఎ గ్రేడ్‌లో ఉన్న ఈ మిస్టర్ కూల్‌కు ఈ సారి ఎలాంటి గ్రేడ్ దక్కలేదు. తాజాగా బీసీసీఐ విడుదల చేసిన కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాలో ధోనీతో పాటు అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్, ఖలీల్ అహ్మద్‌కు కూడా చోటు దక్కలేదు. బీసీసీఐ మొత్తం 27 మంది ఆటగాళ్లకు 4 కేటగిరీల కింద కాంట్రాక్ట్‌లు ఇచ్చింది.

ఎ+ జాబితాలో ముగ్గురు ఆటగాళ్లకు చోటు
బోర్డు ప్రకటించిన ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టులో గ్రేడ్ ఎ+ జాబితాలో ముగ్గురు ఆటగాళ్లకు చోటు దక్కగా... ఏలో పదకొండు మంది, బీలో ఐదుగురు, సీఎలో ఎనిమిది మంది ఉన్నారు. ఎ+ గ్రేడ్‌లో ఉన్న ఆటగాడికి రూ. 7 కోట్లు, ఎ గ్రేడ్‌లో ఉన్న క్రికెటర్లకు రూ. 5 కోట్లు, బి గ్రేడ్‌లో ఉన్న క్రికెటర్లకు 3 కోట్లు, సి గ్రేడ్‌లో ఉన్న క్రికెటర్లకు ఒక కోటి చొప్పున వేతనం లభిస్తుంది.

బీసీసీఐ ప్రకటించిన రోజే!
నవదీప్ సైనీ, మయాంక్ అగర్వాల్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్‌లు తొలిసారి బోర్డు కాంట్రాక్ట్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. కాగా, బీసీసీఐ కాంట్రాక్టు విడుదల చేసిన రోజే ధోనీ జార్ఖండ్ రంజీ జట్టుతో కలిసి మళ్లీ నెట్స్‌లో ప్రాక్టీస్ చేయడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications