నాలుగో స్థానంలో కోహ్లీ: రవిశాస్త్రిది మంచి నిర్ణయం కాదన్న గంగూలీ


హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా ప్రారంభమయ్యే వన్డ వరల్డ్‌కప్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ స్థానం మార్చే అవకాశం ఉందన్న చీఫ్ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయం ఎంతమాత్రం మంచిది కాదని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. మూడో టీ20కి ముందు రవిశాస్త్రి మీడియా సమావేశంలో శాస్త్రి మాట్లాడుతూ భారత్ మిడిలార్డర్‌ని మరింత బలోపేతం చేసేందుకు కోహ్లీ బ్యాటింగ్ స్థానాన్ని మూడు నుంచి నాలుగుకి మార్చాలనే ఆలోచనలో జట్టు మేనేజ్‌మెంట్ ఉన్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే.

శాస్త్రి వ్యాఖ్యలపై స్పందించిన గంగూలీ
తాజాగా రవిశాస్త్రి వ్యాఖ్యలపై సౌరవ్ గంగూలీ స్పందించాడు. రవిశాస్త్రి నిర్ణయం సరైంది కాదని చెప్పుకొచ్చాడు. ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్యూలో "విరాట్ కోహ్లీ ఇటీవల ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మూడో స్థానంలో అత్యుత్తమంగా బ్యాటింగ్ చేశాడు. అయితే, అతడ్ని నాలుగో స్థానంలో ఆడించాలని రవిశాస్త్రి అన్నట్లు న్యూస్ పేపర్స్‌లో చదివాను" అని గంగూలీ అన్నాడు.

మూడో స్థానంలో ఎవరిని ఆడిస్తారు?
"అలా అయితే మూడో స్థానంలో ఎవరిని ఆడిస్తారు? అంబటి రాయుడినా? అదే నిజమైతే, ఇది కచ్చితంగా మంచి నిర్ణయం కాదు. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అతనితో పాటు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ టాపార్డర్‌లో ఉండటం భారత క్రికెట్ జట్టుకు అతిపెద్ద బలం' అని గంగూలీ వెల్లడించాడు.

ఫిబ్రవరి 24 నుంచి భారత్-ఆసీస్‌ల మధ్య తొలి టీ20
త్వరలో ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో ఆస్ట్రేలియా రెండు టీ20లు, ఐదు వన్డేల సిరిస్ ఆడనుంది. ఫిబ్రవరి 24 నుంచి జరిగే తొలి టీ20తో ఈ పర్యటన ప్రారంభం కానుంది. ఈ ఏడాది మేలో ఇంగ్లాండ్ వేదికగా జరిగే వరల్డ్‌కప్‌కు ముందు భారత్ ఆడబోయే ఆఖరి సిరీస్ ఇదే కావడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications