నాటింగ్‌హామ్: రాయల్ లండన్ వన్డే కప్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి. లిస్ట్ ఏ గేమ్‌లో భాగంగా ఇంగ్లాండ్ కంట్రీ జట్లు నాటింగ్‌హాంప్‌షైర్, నార్తాంప్టన్‌షైర్ మధ్య జూన్ 6 (సోమవారం) నాడు జరిగిన మ్యాచ్ చరిత్ర సృష్టించింది. ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్‌లో ఒకే వన్డేలో రెండు జట్లు మొత్తం 870 పరుగులు సాధించాయి.
ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్లు వీరవిహారంతో ఇంగ్లాండ్ గడ్డపై భారతీయ క్రికెటర్లు అయిన సౌరభ్ గంగూలీ-రాహుల్ ద్రవిడ్ పేరిట 17ఏళ్లుగా కొనసాగుతున్న అత్యధిక పరుగుల భాగస్వామ్యం రికార్డు బద్దలైంది. వివరాల్లోకి వెళితే... రాయల్ లండన్ వన్డే కప్‌లో భాగంగా ట్రెంట్ బ్రిడ్జి క్రికెట్ గ్రౌండ్‌లో నాటింగ్‌హాంప్‌షైర్, నార్తాంప్టన్‌షైర్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో ఈ అద్భుతం జరిగింది.
మైఖేల్ లాంబ్ (184), రికీ వెసెల్ (146) తొలి వికెట్‌కు 342 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో నాటింగ్‌హామ్‌షైర్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి 445 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నార్తాంప్టన్‌షైర్ 48.2 ఓవర్లలో 425 పరుగలకే ఆలౌటైంది.

దీంతో నార్తాంప్టన్‌షైర్ జట్టుపై 20 పరుగుల తేడాతో నాటింగ్‌హామ్‌షైర్ జట్టు విజయం సాధించింది. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన 1999 వన్డే ప్రపంచ కప్‌లో శ్రీలంకపై భారత బ్యాట్స్‌మెన్ రాహుల్ ద్రావిడ్-సౌరవ్ గంగూలీ రెండో వికెట్‌కు నెలకొల్పిన 318 పరుగుల భాగస్వామ్య రికార్డు ఈ మ్యాచ్‌తో కనుమరుగైంది.
ఈ మ్యాచ్‌లో రెండో వికెట్‌కు మైఖేల్ లాంబ్-రికీ వెసెల్‌లు 342 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. దీంతోనే మ్యాచ్‌లో విజయం సాధించారు. ఇక వన్డేల్లో ఏ వికెట్‌కైనా అత్యుత్తమ భాగస్వామ్యం వెస్టిండీస్ క్రికెటర్లు క్రిస్ గేల్-మార్లోన్ శామ్యూల్స్ పేరిట ఉంది.
2015 వన్డే ప్రపంచ కప్‌లో జింబాబ్వేపై క్రిస్ గేల్-శామ్యూల్స్ రెండో వికెట్‌కు 372 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక ప్రపంచ క్రికెట్‌లో ఒక జట్టు అత్యధిక పరుగులు చేసిన దేశంగా సుర్రే ఉంది. 2007లో గ్లౌసియిన్‌షైర్ జట్టుపై 50 ఓవర్లలో 4 వికెట్లను కోల్పోయి 496 పరుగులు సాధించింది.