
మరిన్ని బాధ్యతలు అప్పగించాలని దాదా
రిషబ్ పంత్ భారత క్రికెట్ భవిష్యత్తు ఆశాకిరణమని అతడికి మరిన్ని బాధ్యతలు అప్పగించాలని దాదా సూచించారు. ప్రస్తుతం టెస్టు క్రికెట్‌లో భారత్‌కు ప్రాధాన్య కీపర్ కాబట్టి పంత్‌ను ఎక్కువ మ్యాచ్‌లు ఆడించాలని పేర్కొన్నారు. దినేశ్ కార్తీక్‌ను స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌గా జట్టులోకి ఎంపిక చేయాలన్నారు.

దినేశ్ కార్తీక్ కేవలం స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌గా
‘రిషబ్ పంత్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగాలి. దినేశ్ కార్తీక్ కేవలం స్పెషలిస్టు బ్యాట్స్‌మన్ పాత్రకు పరిమితం అవ్వాలి. కాలం గడిచే కొద్దీ పంత్ మన టెస్టు క్రికెట్‌కు ప్రాధాన్య వికెట్ కీపర్‌గా మారతాడు. వన్డేల్లోనూ అతడే కీలకం అవుతాడు. అందుకే అతడికి వికెట్ కీపింగ్ బాధ్యతలను అప్పగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పంత్ మన క్రికెట్ భవిష్యత్తు. అతడు సుదీర్ఘకాలం టీమిండియాకు సేవలందిస్తాడు. రెండు మూడు టెస్టుల్లోనే అతడి ప్రాధాన్యం మనం తెలుసుకున్నాం. రిషబ్ పంత్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ప్రస్తుతం అతడిని మించిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ మనకు లేడు' అని దాదా కుండబద్దలు కొట్టారు.

కీపింగ్ బాధ్యతలు ఇవ్వకపోవడంపై అజారుద్దీన్
తొలి టీ20లో పంత్‌కు కీపింగ్ బాధ్యతలు ఇవ్వకపోవడంపై భారత మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్ పర్యటనలో దినేశ్ కార్తీక్ కంటే పంతే మెరుగ్గా వ్యవహరించాడని పేర్కొన్నాడు. అలాంటిది పంత్‌కు అవకాశమివ్వకుండా దినేశ్ కార్తీక్‌కు బాధ్యతలు అప్పగించడం సరికాదంటూ సూచించాడు.

దినేశ్‌కు కీపింగ్ బాధ్యతలు ఎందుకిచ్చినట్లు
ఇదిలా ఉంటే పంత్‌ను ఒక సాకుగా చూపించి ధోనీని టీ20ల నుంచి తప్పించారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెస్టు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ఇచ్చి కేవలం పరిమిత ఓవర్ల సిరీస్‌లలోనే ఆడుతున్నాడు. అయితే ధోనీ ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. దీంతో అతనిని తప్పించడానికి మాత్రమే పంత్‌ను కీపర్‌గా తీసుకుంటామంటున్నారు. అలా అయితే దినేశ్‌కు కీపింగ్ బాధ్యతలు ఎందుకిచ్చినట్లు అని ప్రశ్నించారు.


Click it and Unblock the Notifications
