Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL Fantasy XI: గంగూలీ జట్టులో ధోనీకి దక్కని చోటు.. కెప్టెన్‌ ఎవరంటే!!

Sourav Ganguly picks Rishabh Pant over MS Dhoni while naming his fantasy IPL XI

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 13వ సీజన్‌ కోసం కోల్‌కతాలో ఈ నెల 19న వేలం పాటముగిసిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌-2020 మ్యాచ్‌లు వచ్చే ఏడాది మర్చి 23న ప్రారంభం కానున్నాయి. మూడు నెలల ముందుగానే ఐపీఎల్ సందడి మొదలయింది. ప్రాంఛైజీలు అన్ని ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇదిలా ఉండగా టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తన డ్రీమ్‌ ఎలెవన్ ఐపీఎల్ జట్టుని ప్రకటించాడు.

 కెప్టెన్‌గా గంగూలీ:

కెప్టెన్‌గా గంగూలీ:

సౌరవ్ గంగూలీ తన డ్రీమ్‌ ఎలెవన్ ఐపీఎల్ జట్టుకి కెప్టెన్‌గా తన పేరునే ప్రకటించుకోవడం ఇక్కడ విశేషం. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్‌లను ఎంచుకున్నాడు. మూడో స్థానంను విరాట్ కోహ్లీ ఇచ్చేసాడు. నాలుగులో దాదానే దిగనున్నాడు. ఇక వికెట్ కీపర్‌గా దిగ్గజం మహేంద్రసింగ్ ధోనీని కాకుండా యువ ఆటగాడు రిషబ్ పంత్‌కి అవకాశం కల్పించాడు.

పేస్ బౌలర్లుగా బుమ్రా, ఆర్చర్‌:

పేస్ బౌలర్లుగా బుమ్రా, ఆర్చర్‌:

ఆల్‌రౌండర్‌ జాబితాలో మార్కస్ స్టాయినిస్, రవీంద్ర జడేజా, ఆండ్రీ రసెల్‌లకు చోటిచ్చాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా యువ రంజీ ప్లేయర్ రియాన్ పరాగ్‌.. పేస్ బౌలర్లుగా జస్‌ప్రీత్ బుమ్రా, జోప్రా ఆర్చర్‌లను ఎంచుకున్నాడు. అయితే దాదా తన జట్టులో స్టాయినిస్, పరాగ్‌లకు చోటివ్వడం ఆశ్చర్యం కలిగించగా.. ధోనీకి అవకాశం ఇవ్వడం పోవడం అభిమానులకు మింగుడుపడడం లేదు.

పంత్‌కు దాదా సపోర్ట్:

పంత్‌కు దాదా సపోర్ట్:

ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు తరఫున ఆడిన గంగూలీ ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవలేదు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మెంటర్‌గా ఉన్నాడు. ఇక ధోనీ చెన్నై సూపర్ కింగ్స్‌కి మూడు టైటిల్స్‌ని అందించాడు. ఇప్పటికి కూడా బెస్ట్ వికెట్ కీపర్. అలాంటిది ధోనీని పక్కన పెట్టడం చర్చనీయాంశం అయింది. పంత్‌ను దాదా సపోర్ట్ చేయడం కూడా దీనికి కారణం కావొచ్చు. అయితే ధోనీని జట్టులోకి తీసుకొచ్చింది గంగూలీనే.

గంగూలీ ఐపీఎల్ జట్టు:

గంగూలీ ఐపీఎల్ జట్టు:

రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), మార్కస్ స్టాయినిస్, రవీంద్ర జడేజా, ఆండ్రీ రసెల్, రియాన్ పరాగ్, జస్‌ప్రీత్ బుమ్రా, జోప్రా ఆర్చర్.

Story first published: Tuesday, December 24, 2019, 16:05 [IST]
Other articles published on Dec 24, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+