Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ముందుంది ముసళ్ల పండగ.. బుడ్డోడి ఎంట్రీపై గంగూలీ వార్నింగ్!

భారత క్రికెట్ యువ సంచలనం, కేవలం 15 ఏళ్ల వయస్సులోనే టీమిండియాకు ఎంపికై చరిత్ర సృష్టించిన యువకెరటం వైభవ్ సూర్యవంశీపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అంతర్జాతీయ క్రికెట్లో ఇంకా అరంగేట్రం కూడా చేయకముందే వైభవ్ సూర్యవంశీపై విపరీతమైన అంచనాల భారాన్ని మోపవద్దని, తన ఆటను మెరుగుపరుచుకోవడానికి అతడికి కాస్త సమయం ఇవ్వాలని సౌరవ్ గంగూలీ సూచించారు.

ఒత్తిడి లేకుండా ఆడనివ్వండి..
సౌరవ్ గంగూలీ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. "వైభవ్ సూర్యవంశీని ప్రస్తుతానికి తన స్టైల్‌లో స్వేచ్ఛగా ఆడనివ్వాలని నేను నమ్ముతున్నాను. అతనికి ఇప్పుడు కేవలం 15 ఏళ్లు మాత్రమే, అందువల్ల అతను ఒత్తిడి గురించి పెద్దగా ఆలోచించడనే అనుకుంటున్నాను. ఐపీఎల్‌లో కూడా మనం ఇదే చూశాం" అని పేర్కొన్నారు. ఐపీఎల్ వాతావరణానికి, అంతర్జాతీయ మ్యాచ్‌లకు చాలా తేడా ఉంటుందని, ముఖ్యంగా విదేశీ పిచ్‌లపై ఆడేటప్పుడు వైభవ్ తన ఆటను పరిస్థితులకు తగ్గట్టుగా మార్చుకోవాల్సి ఉంటుందని మాజీ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డారు.

Sourav Ganguly on Vaibhav Sooryavanshi Don t Expect Wonders Instantly from the 15-Year-Old Prodigy

విదేశీ పిచ్‌లపై సవాల్
భారత్ తరఫున ఆడటం అనేది పూర్తిగా భిన్నమైన విషయమని సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చారు. రాబోయే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో పిచ్‌లు భిన్నంగా ఉంటాయని.. అక్కడ బంతి ఎక్కువగా సీమ్ అవ్వడమే కాకుండా, బౌన్స్, మూవ్‌మెంట్ ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. అక్కడ ఆట తీరు కాస్త మారినప్పటికీ.. వైభవ్‌లో అపారమైన ప్రతిభ ఉందని కొనియాడారు.

అద్భుతాల కోసం తొందరపడొద్దు
"వైభవ్‌కు కాస్త సమయం ఇవ్వండి. జట్టులోకి రాగానే అతనేదో ప్రపంచాన్ని జయించేస్తాడని లేదా పెద్ద అద్భుతాలు చేసేస్తాడని ఇప్పుడే ఆశించకండి. భారత క్రికెట్‌లో మిగిలిన ఆటగాళ్లలాగే అతనిలోనూ అద్భుతమైన టాలెంట్ ఉంది, కాబట్టి అతను అంతర్జాతీయ క్రికెట్‌కు అలవాటు పడేందుకు అవకాశం ఇవ్వాలి" అని గంగూలీ క్రికెట్ అభిమానులకు, విశ్లేషకులకు హితవు పలికారు.

ప్రశంసలు జల్లు కురిపించిన డివిలియర్
మరోవైపు దక్షిణాఫ్రికా మాజీ స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల జల్లు కురిపించారు. వైభవ్‌కు వయసు, అనుభవం తక్కువగా ఉందనే విషయాన్ని పక్కనబెడితే.. అతను తన అద్భుతమైన ఆటతీరుతోనే భారత టీ20 జట్టులో చోటు సంపాదించుకున్నాడని డివిలియర్స్ అన్నారు. "అతను ఇంకా చిన్నపిల్లాడని, సిద్ధంగా లేడని అనడం చాలా సులభం, కానీ అతను తన ప్రతిభతో టీమిండియాలో చోటుకు అర్హుడని నిరూపించుకున్నాడు. అతని ఎంపిక పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను" అని డివిలియర్స్ పేర్కొన్నారు.

Story first published: Monday, June 8, 2026, 9:58 [IST]
Other articles published on Jun 8, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+