Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫోటోలు: గంగూలీ కెప్టెన్సీలో ఛాంపియన్స్ ట్రోఫీ 'Greatest XI'

హైదరాబాద్: జూన్ 1 నుంచి 18 వరకు ఇంగ్లాండ్‌లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టోర్నమెంట్ చరిత్రలో "Greatest XI" అంటూ క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్‌సైట్ ఓ జట్టుని మంగళవారం ప్రకటించింది.

పదకొండు మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీని కెప్టెన్‌గా ఎంపిక చేసింది. మరో వైపు ఈ జాబితాలో టీమిండియా నుంచి ద వాల్ రాహుల్ ద్రవిడ్ కూడా చోటు దక్కించుకున్నాడు.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా రెండు సార్లు గెలిచింది. 2002లో గంగూలీ నేతృత్వంలోని టీమిండియా.. శ్రీలంకతో కలిసి సంయుక్తంగా విజేతగా అవతరించగా, 2013లో ధోని నేతృత్వంలోని టీమిండియా.. ఇంగ్లాండ్‌పై విజయం సాధించి విజేతగా అవతరించింది.

క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్‌సైట్ ఎంపిక చేసిన ఛాంపియన్స్ ట్రోఫీ 'Greatest XI' జట్టు:

క్రిస్ గేల్ (వెస్టిండిస్)

క్రిస్ గేల్ (వెస్టిండిస్)

వెస్టిండిస్ ఆటగాడు క్రిస్ గేల్‌ను ఓపెనర్‌గా క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్ సైట్ ఎంచుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో 17 మ్యాచ్‌లాడిన క్రిస్ గేల్ 791 పరుగులు చేశాడు. 17 వికెట్లు కూడా తీసుకున్నాడు.

గిబ్స్ (దక్షిణాఫ్రికా)

గిబ్స్ (దక్షిణాఫ్రికా)

క్రిస్ గేల్‌కు మరో ఎండ్‌లో ఓపెనర్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన గిబ్స్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్ సైట్ ఎంచుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో 10 మ్యాచ్‌లాడిన గిబ్స్ 460 పరుగులు చేశాడు.

సౌరభ్ గంగూలీ (ఇండియా)

సౌరభ్ గంగూలీ (ఇండియా)

మూడో స్ధానం కోసం గంగూలీని ఎంచుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గంగూలీ ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో 13 మ్యాచ్‌లాడిన గంగూలీ 665 పరుగులు చేశాడు. 2000 ఎడిషన్‌లో సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీలు సాధించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది.

జాక్వస్ కల్లిస్ (దక్షిణాఫ్రికా)

జాక్వస్ కల్లిస్ (దక్షిణాఫ్రికా)

దక్షిణాఫ్రికాకు చెందిన ఈ ఆల్ రౌండర్ 653 పరుగులతో పాటు 20 వికెట్లు కూడా తీశాడు. 1998లో ఆరంభమైన ఛాంపియన్స్ ట్రోఫీ విన్నింగ్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఫైనల్, సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

డామియన్ మార్టిన్ (ఆస్ట్రేలియా)

డామియన్ మార్టిన్ (ఆస్ట్రేలియా)

2006 ఎడిషన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో డామియన్ మార్టిన్ సభ్యుడిగా ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 12 మ్యాచ్‌లాడిన డామియన్ మార్టిన్ 492 పరుగులు చేశాడు.

రాహుల్ ద్రవిడ్ (ఇండియా)

రాహుల్ ద్రవిడ్ (ఇండియా)

రాహుల్ ద్రవిడ్‌ను వికెట్ కీపర్‌గా క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్ సైట్ ఎంపిక చేసింది. 2002 ఎడిషన్‌లో రాహుల్ ద్రవిడ్ వికెట్ కీపర్‌గా ఉన్నాడు. 19 మ్యాచ్ లాడిన రాహుల్ ద్రవిడ్ 627 పరుగులు చేశాడు.

షేన్ వాట్సన్ (ఆస్ట్రేలియా)

షేన్ వాట్సన్ (ఆస్ట్రేలియా)

ఆస్ట్రేలియాకు చెందిన షేన వాట్సన్ 453 పరుగులతో పాటు 17 వికెట్లు తీశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. 2009 ఎడిషన్‌లో ఈ రెండు సెంచరీలు ఆస్ట్రేలియాను విజేతగా నిలబెట్టాయి. 2006, 2009లో ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా అవతరించింది. ఈ రెండుసార్లు వాట్సన్ జట్టు సభ్యుడిగా ఉన్నాడు.

డానియేల్ వెటోరి (న్యూజిలాండ్)

డానియేల్ వెటోరి (న్యూజిలాండ్)

న్యూజిలాండ్‌కు చెందిన డానియేల్ వెటోరి 17 మ్యాచ్‌ల్లో 18 వికెట్లతో పాటు 299 పరుగులు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో వెటోరి అత్యధిక స్కోరు 79.

కైలీ మిల్స్ (న్యూజిలాండ్)

కైలీ మిల్స్ (న్యూజిలాండ్)

న్యూజిలాండ్‌కు చెందిన కైలీ మిల్స్ 15 మ్యాచ్‌ల్లో 28 వికెట్లు తీశాడు. న్యూజిలాండ్ తరుపున 2006, 2009, 2013 ఎడిషన్లలో పాల్గొన్నాడు.

ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక)

ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక)

స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీ ధరన్ 17 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు తీశాడు. 2002లో భారత్‌తో కలిసి శ్రీలంక సంయుక్తంగా విజేత అవతరించిన జట్టులో ముత్తయ్య కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది.

గ్లెన్ మెక్ గ్రాత్ (ఆస్ట్రేలియా)

గ్లెన్ మెక్ గ్రాత్ (ఆస్ట్రేలియా)

ఆస్ట్రేలియాకు చెందిన గ్లెన్ మెక్ గ్రాత్ 12 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు తీశాడు. 2006లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. వెస్టిండిస్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బ్రియాన్ లారాని అవుట్ చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+