
సుప్రీంకోర్టు ఆమోదం తెలపడమే తరువాయి:
సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా ఆదివారం ఏజీఎం సమావేశం జరిగింది. గంగూలీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో లోధా కమిటీ సిఫార్సులైన రెండు పదవుల మధ్య విరామం (కూలింగ్ ఆఫ్ పీరియడ్), క్రికెట్ సలహాదారుల కమిటీ (సీఏసీ), ఐసీసీలో బోర్డు ప్రతినిధి నియామకం తదితర కీలక అంశాలపై చర్చ జరగగా.. ఏజీఎమ్‌లోని సభ్యులు ఆమోదం తెలిపారు. ఇక సుప్రీంకోర్టు ఆమోదం తెలపడమే మిగిలింది.

లోధా సంస్కరణలకు ఆమోదం:
'లోధా సంస్కరణల మార్పుకు సభ్యులు ఆమోదం తెలిపారు. దీన్ని సుప్రీంకోర్డు ఆమోదించాల్సి ఉంది' అని బీసీసీఐ సంబంధిత ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సుప్రీంకోర్టు కూడా ఆమోదిస్తే.. బీసీసీఐ, రాష్ట్ర క్రికెట్ సంఘాల్లో వరుసగా ఆరేళ్ల పాటు పదవిలో ఉన్న ఆఫీస్ బేరర్ మూడేళ్లు తప్పనిసరి విరామం తీసుకోవాలనే లోధా కమిటీ షరతు ఉండదు.

బీసీసీఐ అధ్యక్షుడిగా 2024 వరకు:
అలానే.. బంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఐదేళ్లు పనిచేసిన గంగూలీ 9 నెలల్లో బీసీసీఐ అధ్యక్ష పదివిని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. అంటే.. గంగూలీ 2024 వరకు అధ్యక్ష పదవిలో కొనసాగే అవకాశం ఉంటుంది. గంగూలీతో పాటు బీసీసీఐ కార్యదర్శి జై షా కూడా పూర్తికాలం తన పదవిలో కొనసాగవచ్చు.

మొదటి రోజు నుండే మార్క్:
బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుండే తన మార్క్ చూపించాడు. పదవీ చేపట్టిన వెంటనే దేశీయ ఆటగాళ్ల జీతం విషయంలో మార్పులు తెచ్చాడు. ఆపై కెప్టెన్ విరాట్ కోహ్లీతో మాట్లాడి డే/నైట్ టెస్టులకు ఒప్పించాడు. అనంతరం నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ రాహుల్ ద్రావిడ్‌తో సమావేశం అయి టీమిండియా రోడ్ మ్యాప్‌కు సంబంధించి ప్రణాళికను సిద్ధం చేశారు.


Click it and Unblock the Notifications
