For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అమిత్ షా కొడుకు గూగ్లీకి సౌరవ్ గంగూలీ క్లీన్‌బౌల్డ్ - దాదా ముందున్నవి ఈ రెండే రెండు దారులు

 Sourav Ganguly likely join Delhi Capitals or go back to the Bengal Association.

ముంబై: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కేప్టెన్, లెజెండరీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కథ దాదాపు ముగిసినట్టే. రెండోసారి ఆయన ఈ బాధ్యతలను స్వీకరించడానికి అంగీకరించట్లేదు. అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకోవడం వైపే మొగ్గు చూపారు. ఉద్దేశపూరకంగా గంగూలీని తప్పించారంటూ వార్తలొస్తోన్నాయి. బీసీసీఐలో పేరుకుపోయిన రాజకీయాలకు బలి అయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

టీఎంసీ-బీజేపీ రాజకీయాలకు..

టీఎంసీ-బీజేపీ రాజకీయాలకు..

ఈ వార్తలపై సౌరవ్ గంగూలీ స్పందించలేదు గానీ.. ఆయన సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్‌లో మాత్రం పెద్ద ఎత్తున రాజకీయ దుమారానికి దారి తీసింది. అధికార తృణమూల్ కాంగ్రెస్-ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య వాగ్యుద్ధానికి కేంద్రబిందువు అయింది. తృణమూల్ కాంగ్రెస్‌ సానుభూతిపరుడిగా సౌరవ్ గంగూలీకి ముద్ర పడటం వల్లే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ- ఉద్దేశపూరకంగా ఆయనను రెండోసారి బీసీసీఐ అధ్యక్ష పదవి దక్కకుండా అడ్డుపడిందనే వాదనలు వినిపిస్తోన్నాయి.

18న ఎన్నికల తరువాతే..

18న ఎన్నికల తరువాతే..

బీసీసీఐ అధ్యక్ష పదవికి ఈ నెల 18వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయకపోవచ్చు సౌరవ్ గంగూలీ. అదే సమయంలో బీసీసీఐ ప్రస్తుత కార్యదర్శి, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కుమారుడు జై షా రెండోసారి కొనసాగనున్నారు. సౌరవ్ గంగూలీ స్థానాన్ని 1983 ప్రపంచకప్ విన్నర్ టీమ్ మెంబర్ రోజర్ బిన్నీ నియామకం కాబోతోండటం దాదాపు లాంఛనప్రాయమే. రోజర్ బిన్నీని తదుపరి అధ్యక్షుడిగా అపాయింట్ చేయడానికి బోర్డు సభ్యులు అంగీకారం తెలిపారు.

పోస్టులు ఇలా..

పోస్టులు ఇలా..

బీసీసీఐ ఎన్నికలు ముగిసిన తరువాత- అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ, కార్యదర్శిగా జై షా, ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా, కోశాధికారిగా ఆశీష్ షెల్కర్, జాయింట్ సెక్రెటరీగా దేవజిత్ సైకియా నియమితులు కావడం ఖాయంగా కనిపిస్తోంది. బీసీసీఐ ఆధ్వర్యంలోనే నడిచే ఇండియన ప్రీమియర్ లీగ్ ఛైర్మన్‌గా అరుణ్ ధుమాల్ అపాయింట్ కావొచ్చు.

 రెండే మార్గాలు..

రెండే మార్గాలు..

కాగా- బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకొన్న తరువాత సౌరవ్ గంగూలీ ఏం చేస్తారనే విషయం మీద అప్పుడే చర్చలు మొదలయ్యాయి. ఐపీఎల్‌ ఫ్రాంచైజీలో చేరడానికి అవకాశాలు ఉన్నట్లు వార్తలొస్తోన్నాయి. ఢిల్లీ కేపిటల్స్ ఫ్రాంఛైజీలో కీలక పాత్రను పోషిస్తారనే అంచనాలు ఉన్నాయి. మెంటార్‌గా గంగూలీని తీసుకోవడానికి ఢిల్లీ కేపిటల్స్ ఫ్రాంఛైజీ మేనేజ్‌మెంట్ ఆసక్తిగా ఉందని చెబుతున్నారు. లేదా మళ్లీ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌కే వెళ్తారని, అక్కడ తన సేవలను అందిస్తారని సమాచారం.

Story first published: Wednesday, October 12, 2022, 8:20 [IST]
Other articles published on Oct 12, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+