Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫిట్‌నెస్‌ టెస్ట్ అవసరం లేదు.. నేరుగా శ్రీలంక సిరీస్‌లోనే బుమ్రా పునరాగమనం?!!

Sourav Ganguly Keeps Protocol Aside, Asks Jasprit Bumrah To Skip Ranji Trophy Game

ముంబై: గాయం నుంచి కోలుకున్న టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్‌ బుమ్రా తన ఫిట్‌నెస్‌ను రంజీల్లో నిరూపించుకోవాల్సిన అవసరం దాదాపు ఉండకపోవచ్చని సమాచారం తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో జరిగే శ్రీలంక సిరీస్‌లోనే బుమ్రా నేరుగా పునరాగమనం చేయనున్నాడు. వెన్ను గాయం కారణంగా బుమ్రా గత సెప్టెంబరు నుంచి జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. గాయం కారణంగా బంగ్లాదేశ్, వెస్టిండీస్ సిరీస్‌లకు దూరమయ్యాడు.

ఫిట్‌నెస్‌ టెస్ట్ అవసరం లేదు:

ఫిట్‌నెస్‌ టెస్ట్ అవసరం లేదు:

జనవరిలో శ్రీలంకతో టీ20 సిరీస్‌, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ జరగనుంది. గాయం నుంచి కోలుకున్న బుమ్రా ఈ రెండు సిరీస్‌లకు ఎంపికయ్యాడు. ఫిట్‌నెస్‌ నిరూపించుకోవడానికి రంజీల్లో గుజరాత్ తరఫున ఆడాల్సి ఉంది. అయితే తన పునరాగమన ప్రక్రియపై బుమ్రా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జైషాను కలిసినట్లు సమాచారం తెలుస్తోంది. రంజీల్లో పాల్గొనకుండా పరిమిత ఓవర్ల క్రికెట్‌పై దృష్టిసారించమని వారు బుమ్రాకి తెలిపినట్లు సమాచారం.

రాయితీ బౌలింగ్‌ను ప్రోత్సహించం:

రాయితీ బౌలింగ్‌ను ప్రోత్సహించం:

గంగూలీ, జై షాల నిర్ణయంతో బుమ్రా నేరుగా శ్రీలంక సిరీస్‌లోనే పునరాగమనం చేయనున్నాడు. మరోవైపు రంజీల్లో బుమ్రాతో రోజుకి కేవలం 4 నుంచి 8 ఓవర్లు బౌలింగ్‌ చేయించాలని సెలక్షన్ కమిటీ చేసిన అభ్యర్థనను గుజరాత్‌ జట్టు యాజమాన్యం అంగీకరించనట్లు సమాచారం. అలాంటి రాయితీ బౌలింగ్‌ను మేం ప్రోత్సహించలేమని తేల్చి చెప్పిందట. బుమ్రాకు ఫిట్‌నెస్‌ టెస్ట్ నిర్వహించేందుకు ఇప్పటికే జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) తిరస్కరించిన సంగతి తెలిసిందే.

58 వన్డేల్లో 103 వికెట్లు:

58 వన్డేల్లో 103 వికెట్లు:

జస్ప్రీత్‌ బుమ్రా ఇప్పటి వరకు భారత్ తరఫున 12 టెస్టుల్లో 62 వికెట్లు పడగొట్టాడు. 58 వన్డేల్లో 103 వికెట్లు తీసుకున్నాడు. ఇక 42 టీ20ల్లో 51 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో 5 వికెట్ల ప్రదర్శన 5 సార్లు చేయగా.. వన్డేల్లో ఒకసారి చేసాడు. బుమ్రా టీమిండియా కీలక బౌలర్ అన్న విషయం తెలిసిందే.

Story first published: Wednesday, December 25, 2019, 15:59 [IST]
Other articles published on Dec 25, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+