Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ.. కార్యదర్శిగా అమిత్‌ షా కుమారుడు

Sourav Ganguly Set To Be Next BCCI President || Oneindia Telugu
Sourav Ganguly is the front runner for the post of BCCI president

ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ భారత క్రికెట్‌ బోర్డు (బీసీసీఐ) నూతన అధ్యక్షునిగా ఎన్నికవడం దాదాపు ఖాయం అయింది. కార్యదర్శిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా కుమారుడు జై షా ఎంపిక కానున్నారు. మరోవైపు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌ సోదరుడు అరుణ్‌ ధుమాల్‌ బోర్డు కోశాధికారిగా పగ్గాలు చేపట్టనున్నారు.

నామినేషన్ల దాఖలుకు నేడు చివరి తేదీ:

నామినేషన్ల దాఖలుకు నేడు చివరి తేదీ:

బీసీసీఐ ఎన్నికలలో ఎటువంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా కీలక పదవులు దక్కించుకునేందుకు క్రికెట్‌ వర్గాలు, కేంద్ర రాజకీయ వర్గాల మధ్య గత కొంత కాలంగా చర్చలు కొనసాగాయి. సుదీర్ఘ చర్చల అనంతరం ఆదివారం సాయంత్రం ఒప్పందం కుదిరింది. ఈ నెల 23న బీసీసీఐ ఎన్నికలు జరగనుండగా. నామినేషన్ల దాఖలుకు సోమవారం చివరి తేదీ. అయితే తాజా ఒప్పందం నేపథ్యంలో పోటీ లేకుండా వీరందరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది.

అమిత్‌ షాను కలిసిన దాదా:

అమిత్‌ షాను కలిసిన దాదా:

గంగూలీ ఢిల్లీలో శనివారం అమిత్‌ షాను కలవడంతోనే బోర్డు అధ్యక్షుడుగా 'దాదా' ఖాయం అని తెలిసింది. గంగూలీకి పోటీదారునిగా భావించిన బ్రిజేష్‌ పటేల్‌ అనేక చర్చల అనంతరం పోటీ నుంచి తప్పుకొన్నాడు. శ్రీనివాసన్‌ వర్గీయుడైనబ్రిజేష్‌కు ఐపీఎల్‌ చైర్మన్‌ పదవి ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్టు సమాచారం తెలుస్తోంది.

గంగూలీకి మార్గం సుగమం:

గంగూలీకి మార్గం సుగమం:

2021 బెంగాల్‌ శాసనసభ ఎన్నికల్లో తనకు మద్దతునివ్వాలని అమిత్‌ షా కోరగా.. గంగూలీ హామీ ఇవ్వలేదని తెలిసింది. దీంతో శ్రీనివాసన్‌ వర్గానికి చెందిన బ్రిజేష్‌ పటేల్‌ పేరు అధ్యక్షుడిగా తెరపైకి వచ్చింది. అయితే ఎక్కువ సంఘాలు బ్రిజేష్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడంతో గంగూలీకి మార్గం సుగమమైంది. ఇక పోటీ అన్నదే లేకుండా కార్యవర్గ సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా ఇప్పటికే చర్చలు జరిగినందున గంగూలీ బీసీసీఐ కొత్త బాస్‌గా ఎన్నికవడం లాంఛనమే.

కొత్త బాస్‌గా దాదా:

కొత్త బాస్‌గా దాదా:

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కమారుడైన జై షా కార్యదర్శిగా, బోర్డు మాజీ చీఫ్‌, కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సోదరుడైన అరుణ్‌ ధుమాల్‌ కోశాధికారిగా పగ్గాలు చేపట్టనున్నారు. 47 ఏళ్ల గంగూలీ ప్రస్తుతం బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) అధ్యక్షునిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గంగూలీ బోర్డు అధ్యక్షుడిగా 2020 సెప్టెంబర్ వరకు మాత్రమే కొనసాగగలడు. ఆ తర్వాత నిబంధనల ప్రకారం దాదా విరామం తీసుకోక తప్పదు.

Story first published: Monday, October 14, 2019, 9:12 [IST]
Other articles published on Oct 14, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+