For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాక్‌ ఓడించింది: ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియానే ఫేవరెట్‌

By Nageshwara Rao
Sourav Ganguly Hopes India Return Victorious from England Tour

హైదరాబాద్: ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియానే తన ఫేవరేట్ జట్టని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వెల్లడించాడు. జులై నెలలో కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా సుదీర్ఘ సిరిస్ కోసం ఇంగ్లాండ్ పర్యటనకు బయల్దేరనుంది.

ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో కోహ్లీసేన మూడు టీ20లు, మూడు వన్డేలు, ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను ఆడనుంది. జులై 3 నుంచి భారత్‌-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్‌ ప్రారంభం కానుంది.

ఈ నేపథ్యంలో శనివారం గంగూలీ మీడియాతో మాట్లాడుతూ "ఇంగ్లాండ్‌ గడ్డపై టీమిండియానే విజయం సాధిస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నా. దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్‌లో కోహ్లీ సేన ప్రదర్శన చూసి నేను ఈ మాట చెబుతున్నా. సఫారీ గడ్డపై చేసిన ప్రదర్శనే ఇంగ్లాండ్‌ పర్యనటలో పునరావృతం చేస్తే గెలుపు మనదే' అని గంగూలీ అన్నాడు.

పాక్‌ చేతిలో ఇంగ్లాండ్ ఓటమి

పాక్‌ చేతిలో ఇంగ్లాండ్ ఓటమి

'ఇటీవలే పాక్‌తో జరిగిన టెస్టులో ఇంగ్లాండ్‌ ఓడిపోయింది. పాకిస్థాన్‌ కంటే మనం మెరుగైన స్థితిలో ఉన్నాం. కాబట్టి భారత్‌కు గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి' అని గంగూలీ పేర్కొన్నాడు. ఇక, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి పాలీ ఉమిగ్రర్ అవార్డు ఇవ్వడంపై కూడా దాదా స్పందించాడు.

కోహ్లీ ఆటపై ఎలాంటి అనుమానం లేదు

కోహ్లీ ఆటపై ఎలాంటి అనుమానం లేదు

"కోహ్లీ 30 ఏళ్ల వయస్సుకు దగ్గర్లోకి వచ్చాడు. మరో ఆరు లేదా ఏడేళ్ల పాటు క్రికెట్‌ ఆడతాడు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు" అని గంగూలీ చెప్పాడు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు జగన్మోహన్ దాల్మియా పేరిట బీసీసీఐ కొత్తగా నాలుగు అవార్డులు ప్రవేశపెట్టడాన్ని గంగూలీ హర్షించాడు.

అర్జున్‌కు శుభాకాంక్షలు

అర్జున్‌కు శుభాకాంక్షలు

చివరగా భారత అండర్‌-19 భారత జట్టులో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్‌ టెండూల్కర్ చోటు దక్కించుకోవడంపై గంగూలీ మాట్లాడుతూ ‘ముందుగా అర్జున్‌కు శుభాకాంక్షలు. అతను ఆడటం నేను ఇప్పటి వరకు చూడలేదు. బాగా రాణిస్తాడనే అనుకుంటున్నా' అని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశాడు.

మెస్సీ మ్యాజిక్‌ చూడాలనుకుంటున్నా

మెస్సీ మ్యాజిక్‌ చూడాలనుకుంటున్నా

మరో ఆరు రోజుల్లో రష్యాలో ఆరంభమయ్యే ఫిఫా వరల్డ్ కప్‌పై కూడా గంగూలీ స్పందించాడు. ‘ఫిఫా వరల్డ్‌కప్‌లో బ్రెజిల్‌ నా ఫేవరెట్‌ జట్టు. అయినప్పటికీ అర్జెంటీనా ఆటగాడు లియోనల్ మెస్సీ మ్యాజిక్‌ చూడాలనుకుంటున్నాను. అతడు ప్రపంచకప్‌ గెలవాలని కోరుకుంటున్నా' అని గంగూలీ అన్నాడు.

Story first published: Saturday, June 9, 2018, 16:06 [IST]
Other articles published on Jun 9, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+