For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇమ్రాన్‌ఖాన్‌పై గంగూలీ ఫైర్.. అదొక చెత్త స్పీచ్‌!!

Sourav Ganguly has slammed Pakistan PM Imran Khan for his UN speech


న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితితో భారత్‌పై విద్వేషం వెళ్లగక్కిన పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌పై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మండిపడ్డాడు. ఇమ్రాన్‌ ఖాన్‌ ఓ చెత్త ప్రసంగం చేసాడు అని గంగూలీ పేర్కొన్నాడు. ఇటీవలే ఐక్యరాజ్యసమితిలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ... 'ఇస్లామోఫోబియా ప్రజలను విభజిస్తోంది. ముసుగు ధరించడం ఓ ఆయుధంలా మారిపోయింది. ఓ మహిళ దుస్తులను తీసేయొచ్చు కానీ, మరిన్ని దుస్తులు ధరించలేని పరిస్థితి ఉంది. ప్రత్యేకించి 9/11 దాడి తర్వాత పాశ్చాత్య దేశాల నాయకులు కొందరు ఇస్లాంకి, టెర్రరిజంకి ముడిపెట్టడం వల్ల ఇలా జరిగింది' అని అన్నారు.
దిమ్మతిరిగే కౌంటర్‌:

దిమ్మతిరిగే కౌంటర్‌:

భారత్‌తో యుద్ధం వచ్చే అవకాశాలున్నాయని కూడా ఇమ్రాన్‌ఖాన్‌ పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్య సమితిలో ఇమ్రాన్ ఖాన్ ప్రసంగంపై ఓ అమెరికన్ ఛానల్‌‌ స్పష్టత తీసుకునే క్రమంలో ఆయన ఏదో తప్పుగా మాట్లాడారు. ఈ వీడియోని తన ట్విట్టర్‌లో షేర్ చేసిన మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తనదైన శైలిలో కామెంట్ పెట్టాడు. సెహ్వాగ్ తన ట్విట్టర్‌లో ఆ యాంకర్ ఏమన్నాడో ఆ వ్యాఖ్యలను నేరుగా ట్వీట్టర్‌లో పోస్టు చేశాడు. తనను తాను కించపరుచుకునేందుకు కొత్త మార్గాలు కనిపెట్టారంటూ ట్విటర్‌లో సెహ్వాగ్ పేర్కొన్నాడు.

అదొక చెత్త స్పీచ్‌:

అదొక చెత్త స్పీచ్‌:

తాజాగా సౌరవ్‌ గంగూలీ కూడా ఇమ్రాన్‌ ఖాన్‌కు దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చాడు. 'వీరూ.. ఆ వీడియోను చూసి షాక్‌ గురయ్యా. అది వినకూడని ప్రసంగం. ప్రపంచం మొత్తం శాంతిని కోరుకుంటుంటే.. పాకిస్తాన్‌ మాత్రం వేరే ఆలోచిస్తోంది. 'శాంతి' పాకిస్తాన్‌కు చాలా అవసరం. ఒక దేశానికి ప్రధానిగా ఉన్న ఇమ్రాన్‌ ఇలా మాట్లాడడం సబబు కాదు. అదొక చెత్త స్పీచ్‌. ఇప్పుడు ఇమ్రాన్‌ ఒక క్రికెటర్‌గానే ప్రపంచానికి తెలియలేదు.. ఐక్యరాజ్యసమితిలో చెత్త ప్రసంగం చేసి కూడా తెలిసారు' అని గంగూలీ ట్వీట్ చేసాడు.

పెద్ద ఎత్తున విమర్శలు:

పెద్ద ఎత్తున విమర్శలు:

గత నెల 26 జరిగిన ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 74వ సమావేశాల్లో ఇమ్రాన్‌ఖాన్‌ మాట్లాడాడు. భారత్‌తో యుద్ధం వచ్చే అవకాశాలున్నాయని పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఒక దేశానికి ప్రధానిగా ఉన్న ఇమ్రాన్‌ ఇలా మాట్లాడడం భావ్యం కాదని అందరూ అంటున్నారు. ఈ వివాదం ఎక్కడికి వెళుతుందో చూడాలి.

Story first published: Friday, October 4, 2019, 12:15 [IST]
Other articles published on Oct 4, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+