న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

2020లో న్యూజిలాండ్‌తో డే/నైట్ టెస్ట్?!!

Team India Will Play Next Day-Night Test Match In New Zealand ? || Oneindia Telugu
Sourav Ganguly has his say Will India play Day-Night Test in New Zealand?

కోల్‌కతా: తాజాగా ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా భారత్‌-బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి డే/నైట్ టెస్టు విజయవంతంగా ముగిసింది. ఈ టెస్టును బీసీసీఐ, బెంగాల్‌ క్రికెట్‌ సంఘం విజయవంతంగా నిర్వహించాయి. పిచ్‌ దగ్గర నుంచి ట్రోఫీ ప్రదానోత్సవం వరకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అన్ని బాధ్యతలు తీసుకుని విజయవంతం చేశారు. ఈ పోరులో భారత్‌ ఇన్నింగ్స్‌ 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

<strong>ఇన్‌స్టాలో పోస్ట్.. గంగూలీని ఆటపట్టించిన కుమార్తె!!</strong>ఇన్‌స్టాలో పోస్ట్.. గంగూలీని ఆటపట్టించిన కుమార్తె!!

 న్యూజిలాండ్‌తో డే/నైట్ టెస్ట్

న్యూజిలాండ్‌తో డే/నైట్ టెస్ట్

తొలి డే/నైట్ టెస్టు మ్యాచ్‌ను తిలకించేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో మైదానానికి తరలివచ్చారు. మరోవైపు భారీ స్థాయిలో అతిధులు కూడా వచ్చారు. ఈ నేపథ్యంలో టీమిండియా తదుపరి డే/నైట్ మ్యాచ్‌ను ఎప్పుడు ఆడుతుందనే విషయంపై ఆసక్తి పెరిగింది. అయితే సమాచారం ప్రకారం కోహ్లీసేన తదుపరి డే/నైట్‌ టెస్టును న్యూజిలాండ్‌తో 2020లో ఆడనుందట.

మాకింకా సమయముంది

మాకింకా సమయముంది

భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య 2020లో టెస్టు సిరీస్ జరగనుంది. ఇరు జట్ల మధ్య డే/నైట్‌ టెస్టు నిర్వహించే అవకాశం ఉందా? అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీని మీడియా అడగ్గా... 'ప్రస్తుతానికైతే ఏ నిర్ణయం తీసుకోలేదు. కివీస్‌ టెస్టు సిరీస్‌కు మాకింకా సమయముంది. చూద్దాం' అని సమాధానం ఇచ్చారు.

డే/నైట్‌ టెస్టు భవితవ్యంపై చర్చిస్తాం

డే/నైట్‌ టెస్టు భవితవ్యంపై చర్చిస్తాం

'డే/నైట్‌ టెస్టు భవితవ్యంపై ఇప్పుడే మాట్లాడటం సరికాదు. ఈ విషయాన్ని అందరితో కలిసి చర్చిస్తాం. అయితే.. ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా లాంటి జట్లు మన దేశంలో డే/నైట్‌ టెస్టులు ఆడితే ఎలా ఉంటుందో ఊహించండి. ఎంత మంది ప్రేక్షకులు స్టేడియానికి తరలివస్తారో ఆలోచించండి. పెద్ద జట్లు భారత్‌లో డే/నైట్‌ టెస్టులు ఆడితే పరిస్థితులు చక్కబడతాయి' అని దాదా పేర్కొన్నారు.

Story first published: Tuesday, November 26, 2019, 12:36 [IST]
Other articles published on Nov 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X