అయ్యర్‌కు ఇది అసలైన పరీక్ష.. శ్రేయస్‌పై గంగూలీ హాట్ కామెంట్స్

టీమిండియా యువ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్‌పై బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించాడు. దశాబ్ద కాలంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో శ్రేయస్ అయ్యర్‌కు 50కి పైగా సగటు ఉండడాన్ని గుర్తు చేస్తూ.. ఇది సాధారణ విషయం కాదని కొనియాడాడు. మొత్తంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అయ్యర్‌కు 52 సగటు ఉందని గంగూలీ ప్రశంసించాడు.

టెస్ట్ కెరీర్ ఘనంగా ప్రారంభం
కాగా ఇటీవల న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌తో అంతర్జాతీయ టెస్టు కెరీర్ ప్రారంభించాడు అయ్యర్. అంతేకాకుండా అంతర్జాతీ క్రికెట్‌లో తన ఫస్ట్ మ్యాచ్‌లోనే సత్తా చాటాడు. కాన్పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో అయ్యర్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో సెంచరీ, సెకండ్ ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో తన టెస్టు కెరీర్‌ను ఘనంగా ప్రారంభించాడు.

అయ్యర్‌కు అసలు పరీక్ష సౌతాఫ్రికాలోనే
ఈ నేపథ్యంలో ఓ టీవీ షోలో శ్రేయర్ అయ్యర్‌పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించాడు. జాతీయ క్రికెట్‌లో తన సత్తా నిరూపించుకున్న అయ్యర్‌కు అంతర్జాతీ స్థాయిలో తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడని కితాబిచ్చాడు. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అయ్యర్ బాగా ఆడాడడని మెచ్చుకున్న బీసీసీఐ బాస్.. అతనికి అసలు పరీక్ష మాత్రం ఇప్పుడే ఎదురవుతుందని హెచ్చరించాడు. దక్షిణాఫ్రికా పర్యటన అయ్యర్ సత్తాకు అసలు సిసలైన పరీక్ష అంటూ గంగూలీ చెప్పుకొచ్చాడు.
అక్కడి పేస్ పిచ్‌లపై విపరీతంగా బౌన్స్ అవుతూ వచ్చే బంతులు అయ్యర్‌కు సవాల్ విసురాతయని అన్నాడు. అయితే ఆ బంతులను అయ్యర్ సమర్థవంతంగా ఎదుర్కొని మంచి ప్రదర్శన ఇస్తాడని ఆశిస్తున్నట్లు గంగూలీ తెలిపాడు. అంతేకాకుండా ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలో పేస్, బౌన్స్‌తో వచ్చే బంతులను అతడు నిలబడి ఎదుర్కొని రాణిస్తాడని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పాడు.

అయ్యర్ రికార్డులు
కాగా ఇప్పటివరకు 56 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన 52 సగటుతో 4,794 పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 104 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 44 సగటుతో 3,976 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే అంతర్జాతీయ స్థాయిలో 22 వన్డేలు ఆడిన అయ్యర్.. 42 సగటుతో 813 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతోపాటు 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే అలాగే 32 టీ20 మ్యాచ్‌ల్లో 27 సగటుతో 580 పరుగులు చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లో 50 సగటుతో 202 పరుగులు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications