Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైరల్‌ వీడియో.. 'సెనోరిటా' పాటకు గంగూలీ డాన్స్!!

Sourav Ganguly, Harbhajan Singh Share A Dance As Usha Uthup Sings Senorita

కోల్‌కతా: టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ దాదాగిరి మనకు తెలిసిందే. టీమిండియాకు దూకుడు నేర్పిందే గంగూలీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. మ్యాచ్ మధ్యలో ప్రత్యర్థి కవ్విస్తే ధీటుగా జవాబిస్తాడు బెంగాల్ టైగర్. అలా దూకుడుగా ఉండే గంగూలీలో ఇంకో కోణం కూడా ఉంది. అదే చిలిపి, సరదాతనం. క్రికెట్ ఆడిన రోజుల్లో సహచర ఆటగాళ్లతో కలిసి సరదాగా ఉండేవాడు. తాజాగా అలాంటి ఘటనే జరిగింది. ఆదివారం ఒక షో దాదా డాన్స్ చేసి వార్తల్లో నిలిచాడు.

దాదాగిరి అన్‌లిమిటెడ్‌

దాదాగిరి అన్‌లిమిటెడ్‌

బెంగాలీకి చెందిన ఒక టెలివిజన్‌ చానెల్‌లో 'దాదాగిరి అన్‌లిమిటెడ్‌' పేరుతో ఆదివారం ఒక షో నిర్వహించారు. ఈ షోకి గంగూలీ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఈ షోకు పలువురు భారత మాజీ, ప్రస్తుత క్రికెటర్లు హాజరయ్యారు. వీరేంద్ర సెహ్వాగ్‌, వివిఎస్‌ లక్ష్మణ్‌, మహ్మద్‌ కైఫ్‌, హర్భజన్‌ సింగ్‌, జహీర్‌ ఖాన్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌లు ఈ ఎపిసోడ్‌లో పాల్గొన్నారు.

గంగూలీ డాన్స్

గంగూలీ డాన్స్

ఎపిసోడ్‌ జరుగుతుండగా.. ప్రఖ్యాత గాయని ఉషా ఉతుప్‌ బాలీవుడ్ పాట 'సెనోరిటా'ను ఆలపించారు. ఉషా ఉతుప్‌ పాడిన పాటకు టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ డ్యాన్స్‌ చేసాడు. అంతేకాదు గంగూలీతోను డ్యాన్స్‌ చేయించాడు. తొలుత గంగూలీ డ్యాన్స్‌ చేయడానికి కొంత ఇబ్బంది పడిన దాదా.. చివరకు ఆకట్టుకున్నాడు. అక్కడే ఉన్న ఇతర క్రికెటర్లు క్లాప్స్‌ కొడుతూ ఎంకరేజ్‌ చేశారు.

దాదా సూపర్ డాన్స్

దాదా సూపర్ డాన్స్

హర్భజన్‌ ఎక్కడ ఉంటే అక్కడ సందడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదా డాన్స్ వీడియోను సదరు చానెల్‌ యాజమాన్యం ట్విటర్‌లో షేర్‌ చేయడంతో.. ప్రసుత్తం వైరల్‌గా మారింది. దాదా డాన్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అభిమానులు తెగ లైకులు కొడుతూ.. షేర్ చేస్తున్నారు. అభిమానులు అందరూ దాదాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 'దాదా సూపర్ డాన్స్' అని ఓ అభిమాని ట్వీట్ చేయగా.. 'గంగూలీ కేక' అని మరో అభిమాని ట్వీట్ చేసాడు.

2016లో చివరి మ్యాచ్

హర్భజన్ ఇంకా అధికారికంగా ఆట నుండి రిటైర్ కాలేదు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. 2016 లో యుఎఇతో జరిగిన ఆసియా కప్‌లో టీ20 మ్యాచ్‌లో భారత్ తరఫున ఆడాడు. ఇక 2015 నుండి టెస్ట్ ఆడలేదు. హర్భజన్ చివరగా నవంబర్ 2017లో పంజాబ్ కోసం రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడాడు.

Story first published: Tuesday, January 14, 2020, 11:10 [IST]
Other articles published on Jan 14, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+