
అశ్విన్@1:
టాప్-5లో ఉన్న ఐదుగురు బౌలర్లతో కూడిన జాబితాను ఐసీసీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఉంచింది. ఇందులో అశ్విన్ ఒక్కడే స్పిన్నర్ కావడం విశేషం. ఈ జాబితాలో జేమ్స్ అండర్సన్ (535), స్టువర్ట్ బ్రాడ్ (525), టిమ్ సౌథీ (472), ట్రెంట్ బోల్ట్ (458)లు వరుసగా ఉన్నారు. వీరందరూ కూడా పేస్ బౌలర్లే. మరో విశేషం ఏంటంటే ఈ నలుగురు ఇంగ్లండ్ (అండర్సన్, బ్రాడ్), న్యూజీలాండ్ (సౌథీ, బోల్ట్) ఆటగాళ్లు.

వేగంగా 300 టెస్టు వికెట్లు:
భారత క్రికెట్‌లో రవిచంద్రన్ అశ్విన్ ఎన్నో ఘనతలను సొంతం చేసుకున్నాడు. వేగంగా మూడు వందల టెస్టు వికెట్లను తీసిన బౌలర్‌గా అశ్విన్ రికార్డుల్లోకెక్కాడు. 65 టెస్టుల్లో 25.44 సగటుతో 342 వికెట్లు తీసుకున్నాడు. ఇక 50, 100, 150, 200, 250, 350 వికెట్లను అత్యంత వేగంగా తీసుకున్న భారత టెస్ట్ బౌలర్‌గా అశ్విన్ రికార్డుల్లో ఉన్నాడు.

2017లో చివరి వన్డే
పరిమిత ఓవర్ల క్రికెట్లో మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ రాణించడంతో బీసీసీఐ సెలెక్టర్లు అశ్విన్‌ను పక్కనపెట్టారు. అయితే భారత టెస్ట్ జట్టులో మాత్రం కొనసాగుతున్నాడు. అశ్విన్ 2017 (వెస్టిండీస్ పర్యటన) నుండి పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడలేదు. అశ్విన్ చివరిసారిగా 2017 జూన్ 30న వెస్టిండీస్‌తో భారత్ తరఫున చివరి వన్డే ఆడాడు.

70 టెస్టుల్లో 362 వికెట్లు:
అశ్విన్ ఇప్పటి వరకు భారత్ తరఫున 70 టెస్టుల్లో 362 వికెట్లు పడగొట్టాడు. 11 వన్డేల్లో 150 వికెట్లు తీసుకున్నాడు. ఇక 46 టీ20ల్లో 52 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో 5 వికెట్ల ప్రదర్శన 27 సార్లు చేయగా.. వన్డేల్లో 4 వికెట్ల ప్రదర్శన ఒకసారి, టీ20ల్లో రెండు సార్లు చేసాడు.


Click it and Unblock the Notifications












