Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హర్భజన్ సింగ్‌కు గంగూలీ క్షమాపణ: అసలేం జరిగింది?

Sourav Ganguly Goofs Up About Harbhajan Singh's Family Picture, Apologises

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ భారత వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌కు క్షమాపణలు చెప్పాడు. హర్భజన్‌కు గంగూలీ సారీ చెప్పడం ఏంటని అనుకుంటున్నారా?

వివరాల్లోకి వెళితే
ఆదివారం హర్భజన్ సింగ్ తన భార్య గీతా బస్రా, కుమార్తె హినయా హీర్ పల్హాతో కలిసి అమృత్‌ సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించాడు. ఈ సందర్భంగా ఫ్యామిలీతో కలిసి ఫొటోను అభిమానులతో ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు.



దీనికి గాను 'బాబు ఎంతో అందగా ఉన్నాడు భజ్జీ' అని గంగూలీ ట్వీట్ చేశాడు. ఆపై వెంటనే తాను చేసిన తప్పుని గుర్తించిన దాదా... 'క్షమించు హర్భజన్.. పాప చాలా అందంగా ఉంది.వయసు మీద పడుతుంది కదా' అని మరో ట్వీట్ చేశాడు.

దీనికి హర్భజన్ స్పందిస్తూ 'ఆశీస్సులు అందినందుకు ధన్యవాదాలు దాదా. సనాకు ప్రేమతో(గంగూలీ కూతురు).. త్వరలోనే మిమ్మల్ని కలుస్తానని ఆశిస్తున్నా' అని హర్భజన్ ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే గంగూలీ కెప్టెన్సీలోనే హర్భజన్ సింగ్ కీలక స్పిన్నర్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే.

భారత్ తరుపున 103 టెస్టులాడిన హార్భజన్ సింగ్ అందులో 37 టెస్టులు గంగూలీ కెప్టెన్సీలోనే ఆడటం విశేషం. గంగూలీ కెప్టెన్సీలో భజ్జీ 15 సార్లు 5వికెట్లను, 10 సార్లు 3 వికెట్లను పడగొట్టాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, November 21, 2017, 17:37 [IST]
Other articles published on Nov 21, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+