Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స‌చిన్ Vs సౌర‌బ్: ధోనీకి అండ‌గా నిలిచిన గంగూలీ!

ICC Cricket World Cup 2019 : Sourav Ganguly Gives A Fitting Reply To MS Dhoni’s Critics || Oneindia
Sourav Ganguly gives fitting reply to MS Dhonis critics after Indias win over Afghanistan

లండ‌న్‌: ఆప్ఘ‌నిస్తాన్‌తో ఆడిన ఒకే ఒక్క మ్యాచ్.. టీమిండియా మాజీ కేప్టెన్‌, మిడిలార్డ‌ర్ బ్యాట్స్‌మెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీపై విమ‌ర్శ‌ల‌కు కార‌ణ‌మైంది. భార‌త క్రికెట్ లెజెండ‌రీ బ్యాట్స్‌మెన్ స‌చిన్ టెండుల్క‌ర్ మొద‌లుకుని పలువురు విశ్లేష‌కులు ధోనీ బ్యాటింగ్ శైలిని త‌ప్పు పట్టారు. లోపాల‌ను ఎత్తి చూపారు. ఆట‌తీరుపైనా విమ‌ర్శ‌లు గుప్పించారు. మిడిలార్డ‌ర్‌లో ఎంఎస్ ధోనీ-కేదార్ జాద‌వ్‌ల మ‌ధ్య నెల‌కొన్న భాగ‌స్వామ్యం ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ త‌ర‌ఫున అత్యంత మంద‌గ‌మ‌నంతో సాగినట్టుగా చెబుతున్నారు విశ్లేష‌కులు. ఎదురుగా ఆఫ్ఘనిస్తాన్ వంటి బ‌లహీన‌మైన జ‌ట్టు ఉన్న‌ప్ప‌టికీ.. ధోనీ త‌న స‌హ‌జ శైలికి భిన్నంగా ఆడాడని, అత‌ని బ్యాటింగ్ తీరు త‌న‌ను తీవ్ర నిరాశ‌కు గురి చేసిందంటూ స‌చిన్ టెండుల్క‌ర్ సైతం విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు.

ఒక్క మ్యాచ్‌కే విమ‌ర్శ‌లా?

ఒక్క మ్యాచ్‌కే విమ‌ర్శ‌లా?

ఇన్ని విమ‌ర్శ‌ల మ‌ధ్య ధోనీకి ఓ అండ దొరికింది. టీమిండియా మాజీ కేప్టెన్ సౌర‌బ్ గంగూలీ ధోనీకి మ‌ద్ద‌తుగా నిలిచాడు. ఆయ‌న బ్యాటింగ్‌ను త‌ప్పు ప‌ట్టాల్సిన ప‌నేమీ లేదంటూ ఎదురుదాడికి దిగారు. స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. ఒక్క ఇన్నింగ్‌తోనే ధోనీని త‌ప్పు పట్టే అర్హ‌త ఎవ‌రికీ లేద‌ని అన్నారు. ధోనీ ఎలాంటి బ్యాట్స్‌మెన్ అనేది అంద‌రికీ తెలుస‌ని, ఇప్పుడు కొత్త‌గా ఆయ‌న త‌న‌ను తాను నిరూపించుకోవాల్సిన అవ‌సరం లేద‌ని చెప్పారు. ఆప్ఘ‌నిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌ను ఎదుర్కొన్న‌ప్పుడు ధోనీ ఎలా ఆడారో అంద‌రూ చూశార‌ని, అలాంటప్పుడు ఆయ‌న‌ను ఎలా విమర్శించ‌గ‌లుగుతార‌ని సౌర‌బ్ గంగూలి నిల‌దీశారు. గురువారం మాంఛెస్ట‌ర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో వెస్టిండీస్‌తో జ‌రిగే మ్యాచ్ సంద‌ర్భంగా ధోనీ త‌న స‌హ‌జ సిద్ధ బ్యాటింగ్ శైలిని అందిపుచ్చుకుంటాడ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

ఎందుకీ విమ‌ర్శ‌లు?

ఎందుకీ విమ‌ర్శ‌లు?

ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో భాగంగా ఈ నెల 22వ తేదీన సౌతాంప్ట‌న్‌లోని రోజ్‌బౌల్ స్టేడియంలో ఆఫ్ఘ‌నిస్తాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ధోనీ చాలా మంద‌కొడిగా బ్యాటింగ్ చేసిన విష‌యం తెలిసిందే. 52 బంతుల‌ను ఎదుర్కొన్న ధోనీ కేవ‌లం 28 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగాడు. ర‌షీద్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌ను ఆడాల‌నే ఉద్ద‌శంతో క్రీజును వదిలి ముందుకొచ్చాడు. బంతి మిస్ అయ్యాడు. అంతే- వికెట్ల వెనుక కాపు కాస్తోన్న కీప‌ర్‌.. బెయిల్స్‌ను ఎగుర‌గొట్టేశాడు. నిజానికి- ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓపెన‌ర్లు స‌హా మిడిలార్డ‌ర్ బ్యాట్స్‌మెన్లు సైతం విఫ‌లం అయ్యారు. ఫ‌లితంగా- 224 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్నే ఆఫ్ఘ‌నిస్తాన్ ముందు ఉంచ‌గ‌లిగింది టీమిండియా. ఆఫ్ఘ‌నిస్తాన్ కాబ‌ట్టి స‌రిపోయింద‌ని, అదే ఇంకే జ‌ట్టు ఉన్నా ల‌క్ష్యాన్ని అందుకునేదేన‌ని అంటూ స‌చిన్ టెండుల్క‌ర్ స‌హా ప‌లువురు క్రికెట్ పండితులు విశ్లేషించారు.

Story first published: Wednesday, June 26, 2019, 12:04 [IST]
Other articles published on Jun 26, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+