Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ODI World Cup 2023: వరల్డ్ కప్‌ షెడ్యూల్ విడుదలైన వేళ.. గంగూలీ ఎమోషనల్ పోస్ట్..!

ప్రపంచ క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఆశగా ఎదురు చూసిన వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదలైంది. ఈ ఏడాది అక్టోబర్ 5న చివరి వరల్డ్ కప్ ఫైనలిస్టులు ఇంగ్లండ్, న్యూజిల్యాండ్ పోరుతో ఈ టోర్నీ మొదలవుతుంది. భారత జట్టు అక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌తో లీగ్‌లో తమ జర్నీ ప్రారంభిస్తుంది. అందరూ ఆసక్తిగా ఎదరు చూస్తున్న భారత్, పాక్ మ్యాచ్ అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా జరుగుతుంది.

ఈ షెడ్యూల్ విడుదలవగానే క్రికెట్ ఫ్యాన్స్ తెగ సంతోషించారు. తమ ఫేవరెట్ జట్ల మ్యాచులు ఎప్పుడని క్యాలెండర్లలో మార్క్ చేసుకోవడం మొదలు పెట్టేశారు కూడా. ఈ క్రమంలోనే భారత్, పాక్ మ్యాచ్ జరిగే రోజున అహ్మదాబాద్‌లో ఉండేందుకు హోటల్స్ కూడా ఇప్పటి నుంచే బుక్ చేసుకుంటున్నారు. దీంతో ఈ సిటీలో హోటల్ గదుల ధరలు కూడా పెరిగిపోయాయట.

Former legend Sourav Ganguly posts

ఇలాంటి క్రమంలో బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఎమోషనల్ పోస్టు పెట్టాడు. 'భారత్‌లో వరల్డ్ కప్ కోసం ఎదురు చూస్తున్నా. కరోనా కారణంగా నేను ప్రెసిడెంట్‌గా ఉండగా వరల్డ్ కప్ నిర్వహించలేకపోయా. ఈ వరల్డ్ కప్ ఎంత గొప్పగా ఉంటుందని ఆసక్తిగా ఉన్నా. అద్భుతమైన వేదికలు, చక్కగా అలాట్ చేశారు. ఇన్ని వేదికలు ఉన్నాయని మరే దేశమూ గర్వంగా చెప్పుకోలేదు' అని గంగూలీ అన్నాడు.

అలాగే ప్రపంచం అంతా గుర్తుంచుకునే రేంజ్‌లో ఈ టోర్నీని బీసీసీఐ నిర్వహిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. 'ప్రపంచం మర్చిపోలేనంత గొప్పగా బీసీసీఐ ఈ టోర్నీ నిర్వహిస్తుంది. బీసీసీఐ, జై షా, రోజర్ బిన్నీ.. అందరికీ కంగ్రాట్స్' అని గంగూలీ ట్వీట్ చేశాడు. గంగూలీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2021 టీ20 క్రికెట్ వరల్డ్ కప్‌ను భారత్‌లో నిర్వహించాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా ఈ టోర్నీని యూఏఈకి తరలించాల్సి వచ్చింది.

Story first published: Thursday, June 29, 2023, 19:03 [IST]
Other articles published on Jun 29, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+