Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Sourav Ganguly: సౌరవ్ గంగూలీకి తృటిలో తప్పిన ప్రమాదం.. రెండు కార్లు ధ్వంసం!

Sourav Ganguly: టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ కారు దుర్గాపూర్ ఎక్స్‌‌ప్రెస్ వేపై ప్రమాదానికి గురైంది. సౌరవ్ గంగూలీ గురువారం రాత్రి ఓ కార్యక్రమానికి బుర్ద్వాన్ వెళ్తుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సౌరవ్ గంగూలీ ప్రయాణిస్తున్న కారుకు ముందుగా వెళ్తున్న ఓ లారీ సడెన్ గా బ్రేకులు వేయడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ క్రమంలోనే వెనుక నుంచి వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టగా.. గంగూలీ కాన్వాయ్ అలాగే మరో రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి.

వాటిలో ఒక కారు సౌరవ్ గంగూలీ కారును ఢీకొట్టింది. అదృష్టవశాత్తు గంగూలీతో పాటు ఆయన కారులోని ఎవరికీ గాయాలు కాలేదు. కానీ గంగూలీ కాన్వాయ్ లోని రెండు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ప్రమాదం తర్వాత గంగూలీ దాదాపు 10 నిమిషాల పాటు రోడ్డుపై వేచి ఉండాల్సి వచ్చింది. అనంతరం అక్కడి నుంచి గంగూలీ కాసేపటి తర్వాత బుర్ద్వాన్ లో కార్యక్రమానికి బయలుదేరారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గంగూలీ వెళ్తున్న సమయంలో భారీ వర్షం పడుతున్నట్లు తెలిసింది.

Sourav Ganguly Escapes Narrow Accident Two Cars Destroyed in the Incident

సౌరవ్ గంగూలీ టీమిండియా కెప్టెన్ గా ఎన్నో విజయాలను భారత జట్టుకు అందించారు. టీమిండియా తరఫున 311 వన్డేల్లో 40.73 సగటుతో 11 వేల 363 పరుగులను చేశాడు. సౌరవ్ గంగూలీ వన్డేలలో 22 సెంచరీలు, 72 అర్ధశతకాలు బాదాడు. బెస్ట్ స్కోరు 183 పరుగులు. టెస్ట్ మ్యాచ్ లలో 42.18 సగటుతో 7 వేల 212 పరుగులు చేశాడు. ఇందులో 16 శతకాలు, 35 అర్ధ శతకాలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్ లో గంగూలీ అత్యుత్తమ స్కోరు 239 పరుగులు.

Story first published: Friday, February 21, 2025, 8:46 [IST]
Other articles published on Feb 21, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+