Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఈరోజు కూడా హాస్పిట‌ల్లోనే గంగూలీ.. డిశ్చార్జ్ ఎప్పుడంటే?‌!!

Sourav Ganguly decides to extend his stay in the Woodlands hospital by one more day

కోల్‌క‌తా: బీసీసీఐ అధ్య‌క్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీ బుధవారం కూడా హాస్పిట‌ల్‌లోనే ఉండనున్నారు. సౌరవ్ ఈరోజు డిశ్చార్జ్ కావాల్సి ఉన్నా.. మరొకరోజు హాస్పిట‌ల్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నారట. ప్ర‌స్తుతం దాదా ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని, వైద్య ప‌రంగా అత‌ను ఫిట్‌గా ఉన్నార‌ని కోల్‌క‌తాలోని వుడ్‌ల్యాండ్స్ హాస్పిట‌ల్‌ వైద్యులు తాజాగా వెల్లడించారు. దాదా కోసం ప్రత్యేక వైద్య బృందం నిరంతం శ్రమిస్తుందని చెప్పారు.

సౌర‌వ్ గంగూలీ చికిత్స గురించి బుధవారం వుడ్‌ల్యాండ్స్ హాస్పిట‌ల్ వ‌ర్గాలు ఓ ప్ర‌క‌ట‌న చేశాయి. 'ప్ర‌స్తుతం సౌరవ్ గంగూలీ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంది. వైద్య ప‌రంగా అత‌ను ఫిట్‌గా ఉన్నారు. అయితే సౌర‌వ్ మ‌రొక రోజు హాస్పిట‌ల్‌లోనే ఉండాల‌నుకుంటున్నారు. గురువారం దాదా డిశ్చార్జ్ అవుతారు. దాదా కోసం ప్రత్యేక వైద్య బృందం అతనితో పాటే ఉంది' అని వుడ్‌ల్యాండ్స్ హాస్పిట‌ల్ డాక్ట‌ర్లు వెల్ల‌డించారు. గంగూలీని గురువారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని వుడ్‌ల్యాండ్స్ హాస్పిట‌ల్ ఎండీ, సీఈఓ డాక్టర్ రూపాలి బసు కూడా చెప్పారు. ఇంటికి వెళ్లాక కూడా వైద్యం కొనసాగుతుందన్నారు.

ప్రఖ్యాత కార్డియాలజిస్ట్ డాక్టర్ దేవి శెట్టి సౌరవ్ గంగూలీకి చికిత్స అందించిన తొమ్మిది మంది వైద్యుల వైద్య బృందాన్ని కలిశారు. దాదా ఆరోగ్యంపై అన్ని వివరాలు కనుక్కున్నారు. శనివారం గుండెపోటు వ‌చ్చిన సౌర‌వ్ గంగూలీకి కోల్‌క‌తాలోని వుడ్‌ల్యాండ్స్ హాస్పిట‌ల్‌లో చికిత్స జ‌రిగిన విష‌యం తెలిసిందే. దాదా గుండెకు రెండు షంట్లు కూడా వేశారు. గంగూలీ భారత్ తరఫున 113 టెస్టులు, 311 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 7212 రన్స్, వన్డేల్లో 11363 పరుగులు చేశాడు. మొత్తం 38 అంతర్జాతీయ శతకాలు నమోదు చేశాడు.

సౌరవ్ గంగూలీ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతారని అదానీ విల్మార్ డిప్యూటీ సీఈవో అంగ్షు మల్లిక్ మంగళవారం చెప్పారు. గంగూలీ స్వల్ప గుండెనొప్పితో కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్‌ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి కంపెనీ రూపొందించిన టెలివిజన్‌ వాణిజ్య ప్రకటన ప్రసారాన్ని నిలిపివేశారు. ఆరోగ్యమైన గుండె కోసం, రోగనిరోధకశక్తిని పెంచేందుకు ఫార్చ్యూన్‌ ఆయిల్‌ను వాడాలని ఆ యాడ్‌లో గంగూలీ చెబుతుంటారు.

Story first published: Wednesday, January 6, 2021, 12:11 [IST]
Other articles published on Jan 6, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+