శ్రీలంక బోర్డు చేతులెత్తేయడంతో.. యూఏఈలో ఆసియా కప్.. కన్ఫామ్ చేసిన సౌరవ్ గంగూలీ

శ్రీలంక వేదికగా జరగాల్సిన ఆసియా కప్‌ను యూఏఈకి తరలించినట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గురువారం వెల్లడించారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం ముగిశాక గంగూలీ విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని కన్ఫామ్ చేశాడు. 'ఆసియా కప్ యూఏఈలో జరుగుతుంది. వర్షాలు లేని ఏకైక ప్లేస్ అది కాబట్టే అక్కడే నిర్వహించడం బెటర్' అని గంగూలీ చెప్పాడు. ఇక శ్రీలంక క్రికెట్ బుధవారం ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కి తాము ఆసియా కప్ నిర్వహించలేమని చేతులెత్తేస్తూ తన నిర్ణయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే.
దేశంలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం వల్ల ఆసియా కప్ లాంటి బిగ్ టీ20 టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే స్థితిలో శ్రీలంక బోర్డు లేదు. ఇటీవలే లంక ప్రీమియర్ లీగ్ (LPL) మూడో ఎడిషన్ కూడా ఈ సంక్షోభం కారణం వాయిదా పడింది. ఆసియా కప్ ఆగస్టు 27నుండి సెప్టెంబర్ 11వరకు జరగనుంది. ఈసారి టీ20 ఫార్మాట్‌లో దీన్ని నిర్వహించనున్నారు.

ఆస్ట్రేలియాతో సిరీస్‌లను విజయవంతం
ఇటీవల ఆస్ట్రేలియాతో మూడు ఫార్మాట్ల సిరీస్‌లను శ్రీలంక క్రికెట్ బోర్డు విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్‌ను కూడా ఏ ఆటంకాలు లేకుండా నిర్వహిస్తున్న లంక క్రికెట్ బోర్డు.. ఆసియా కప్ నిర్వహణ మాత్రం తమ వల్ల కాదంటూ తేల్చేసింది. మొత్తం ఆరు దేశాలు ఆసియా కప్ టోర్నీలో పాల్గొంటాయి. దీంతో ఈ టోర్నీకి వచ్చే జట్ల ప్లేయర్లు, సపోర్టింగ్ స్టాఫ్ అందరికీ హోటల్ వసతులు, స్టేడియంలో సౌకర్యాల కల్పన, ఇతరత్రా ఖర్చు ప్రస్తుతం శ్రీలంక క్రికెట్ బోర్డు భరించేలా లేదు.

మధ్యలో నిరసనల సెగ
ఈ నేపథ్యంలో ఆసియా కప్ నిర్వహిస్తే మధ్యలో ఎలాంటి నిరసనల సెగ తగిలినా, మధ్యలో టోర్నీ ఆగినా.. ఆ దేశానికి అపకీర్తి మూటగట్టుకోవాల్సి వస్తుంది. అందువల్ల ఆసియా కప్ నిర్వహించడం కంటే తప్పుకోవడమే ఉత్తమమన్న నిర్ణయానికి లంక బోర్డు వచ్చింది. గతంలో ఏసీసీ అధికారులు శ్రీలంకలో సాధ్యం కాకుంటే బంగ్లాదేశ్‌ను స్టాండ్ బై హోస్ట్ దేశంగా ప్రకటించినా ఇప్పుడు బంగ్లాలో కూడా నిర్వహించడానికి ఏసీసీ ఇష్టపడలేదు. ఎందుకంటే.. వర్షాకాలంలో బంగ్లాదేశ్‌లో టోర్నీ నిర్వహిస్తే దాదాపు సగం మ్యాచ్‌లు తుడుచుకుపెట్టుకుపోయే ప్రమాదముంది.

హఠాత్తుగా అంత సాహసం చేయలేక
అలాగే ఇంత హఠాత్తుగా ఆసియా కప్ లాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీని నిర్వహించడానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా సాహసం చేయలేదు. అందువల్ల రేసు నుంచి తప్పుకుంది. ఈ టోర్నీని నిర్వహించేందుకు ఏసీసీ అధికారులు యూఏఈ క్రికెట్ బోర్డును సంప్రదించారు. ఇక చర్చలు సఫలమయ్యాయి. దీంతో యూఏఈలో నిర్వహించేందుకు కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఒప్పుకోవడంతో పాటు.. యూఏఈ క్రికెట్ బోర్డు కూడా సమ్మతించింది. దీంతో ఆసియా కప్ టోర్నీ ఈసారి యూఏఈలో జరగబోతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications