త్వరలో నా బయోపిక్:
సౌరవ్ గంగూలీ ఈ రోజు ఓ ట్వీట్ చేస్తూ తన బయోపిక్ గురించి అసలు విషయాన్ని వెల్లడించాడు. 'క్రికెటే నా జీవితంగా మారింది. అది నా ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా ఏ సందర్భంలోనూ తలవంచకుండా ముందుకు సాగడాన్ని నేర్పింది. ఈ ప్రయాణంను నేను ఎంతో ఆస్వాదించా. లవ్ ఫిల్మ్స్ చిత్ర నిర్మాణ సంస్థ నా జీవితాన్ని వెండితెరపైకి సాక్ష్యాత్కరించే బాధ్యత తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది' అని గంగూలీ ట్వీట్ చేశారు. దాదా బయోపిక్‌ను తామే నిర్మిస్తున్నట్లు లవ్ ఫిల్మ్స్ కూడా గురువారం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. ఇది తమకు గొప్ప గౌరవమని, గ్రేట్ ఇన్నింగ్స్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు చెప్పింది.
హృతిక్ రోషన్/రణబీర్ కపూర్:
ఇప్పటివరకైతే సౌరవ్ గంగూలీ బయోపిక్‌లో ఏ హీరో నటిస్తాడో ఇంకా సమాచారం తెలియనప్పటికీ.. గతంలో దాదా ఓ సందర్భంలో మాట్లాడుతూ తన బయోపిక్‌లో హృతిక్ రోషన్ నటిస్తే బాగుంటుందని అన్నాడు. ప్రస్తుతం బీ-టౌన్‌లో రణబీర్ కపూర్, రణవీర్ సింగ్ పేర్లు వినిపిస్తున్నాయి. తన చిన్ననాటి స్నేహితురాలు డోనాను ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో పాటు క్రికెట్ కెరీర్‌లో గంగూలీ సాధించిన అద్భుత విజయాల ఆధారంగా మూవీ తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది.

బయోపిక్‌ల హవా:
ప్రస్తుతం బాలీవుడ్‌లోనే కాదు.. ప్రతీ ఇండస్ట్రీలలో బయోపిక్‌ల హవా నడుస్తోంది. ఇప్పటికే పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖుల జీవిత గాధల ఆధారంగా సినిమాను రూపొంది మంచి సక్సెస్ సాధించాయి. ఇప్పటికే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీలపై బయోపిక్‌లు రాగా.. మాజీ సారథి కపిల్ దేవ్‌పై తెరకెక్కిన 83 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. టీమిండియా మహిళా కెప్టెన్ మిథాలీ రాజ్, సీనియర్ బౌలర్ జులన్ గోస్వామిలపై కూడా బయోపిక్‌లు వస్తున్నాయి. బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బయోపిక్ కూడా వస్తోంది.

దూకుడు నేర్పించిన కెప్టెన్:
2000వ సంవత్సరంలో భారత జట్టు కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీ బాధ్యతలు చేపట్టాడు. ఆ సమయంలో భారత క్రికెట్ తీవ్ర సంక్షోభవంలో ఉంది. అప్పట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం ఓ పెద్ద దుమారమే లేపింది. అలాంటి సమయంలో జట్టు పగ్గాలు అందుకున్న గంగూలీ.. తనదైన శైలిలో దూకుడు నేర్పించి టీమిండియా విదేశాల్లో సైతం టెస్టులు నెగ్గగలదని నిరూపించాడు. 2003లో టీమిండియాను ప్రపంచకప్ ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. ఒక ప్రపంచకప్ పక్కనపెడితే గంగూలీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో దాదాపు అన్ని ప్రతిష్టాత్మక ట్రోఫీలను భారత్‌కు అందించారు. 2019 అక్టోబర్ 23న బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నాడు. భారత్ తరపున దాదా 113 టెస్టులు, 311 వన్డేలు ఆడాడు.


Click it and Unblock the Notifications












