Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గంగూలీ ఖాతాలో మరో మైలురాయి: ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో తొలి మ్యాచ్‌కి సన్నాహాలు!

Sourav Ganguly confirms Asia XI vs World XI match at Sardar Patel Cricket Stadium in 2020

హైదరాబాద్: బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత క్రికెట్‌లో చాలా త్వరితగతిన అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా తొలి డే నైట్ టెస్టు మ్యాచ్ ఆడింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఫలితంగా బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేయడంతో పాటు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. డే నైట్ టెస్టు ఊహించిన దానికంటే విజయవంతం కావడంతో రాబోయే రోజుల్లో ప్రతి సిరిస్‌లోనూ టీమిండియా ఓ డే నైట్ టెస్టు మ్యాచ్ ఆడాలని తన మనసులోని కోరికను బయటపెట్టాడు.

తాజాగా, భారత క్రికెట్‌లో సౌరవ్ గంగూలీ మరో అడుగు ముందుకేసే నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే ఏడాది ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఆసియా ఎలెవన్, వరల్డ్ ఎలెవన్‌ల మధ్య ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించేందుకు గంగూలీ సిద్ధమయ్యాడు.

ఈ స్టేడియంలో తొలి మ్యాచ్‌ని నిర్వహించేందుకు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా వరల్డ్ ఎలెవన్ vs ఇండియా జట్ల మధ్య జరగనున్న టీ20 మ్యాచ్‌కి ఈ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.

2018 జనవరిలో శంకుస్థాపన

2018 జనవరిలో శంకుస్థాపన

మొతెరాలో ఉన్న స్టేడియాన్ని తొల‌గించి, అదే స్థానంలో కొత్త స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. ఈ స్టేడియం నిర్మాణానికి 2018 జనవరిలో శంకుస్థాపన జరిగింది. మొతేరాలోని 63 ఎకరాల్లో ఈ స్టేడియం విస్తరించి ఉంది. ఈ స్టేడియాన్ని ప్రముఖ ఆర్చిటెక్చర్ సంస్థ పాపులస్ డిజైన్ చేసింది. నిర్మాణ బాధ్యతలను ఎల్ అండ్ టీ సంస్థ చేజిక్కించుకుంది.

మెల్‌బోర్న్ స్టేడియాన్ని నిర్మించిన పాపుల‌స్

మెల్‌బోర్న్ స్టేడియాన్ని నిర్మించిన పాపుల‌స్

మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ) నిర్మించింది కూడా పాపుల‌స్ సంస్థే. ఈ స్టేడియం నిర్మాణానికి 700 కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేస్తున్నారు. ప్ర‌స్తుతం స్టేడియం నిర్మాణానికి అయ్యే ఖ‌ర్చును గుజ‌రాత్ క్రికెట్ అసోసియేష‌న్ భ‌రిస్తోంది. మొతెరా స్టేడియం అందుబాటులోకి వ‌స్తే.. మెల్‌బోర్న్ రికార్డును అధిగ‌మిస్తుంది.

మొత్తం 63 ఎకరాల స్థలంలో

మొత్తం 63 ఎకరాల స్థలంలో

మొత్తం 63 ఎకరాల స్థలంలో నిర్మిస్తోన్న ఈ స్టేడియంలో ఒకేసారి 1.10 లక్షల మంది కూర్చోవచ్చు. మెల్‌బోర్న్ స్టేడియం కెపాసిటీ 90వేలు. ఈ స్టేడియంలో మొత్తం నాలుగు డ్రెస్సింగ్ రూమ్‌లు, మూడు ప్రాక్టీస్ గ్రౌండ్‌లు ఉంటాయి. ట్రైనింగ్ సెంటర్‌తో పాటు 50 గదులతో క్లబ్ హౌస్ ఉంటుంది. 76 కార్పోరేట్ బాక్సులు, పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంటాయి.

ప్రత్యేకంగా కార్పొరేట్ బాక్సులు

ప్రత్యేకంగా కార్పొరేట్ బాక్సులు

పెద్ద సంఖ్య‌లో కార్పొరేట్ బాక్సులు ఉన్న స్టేడియం ప్ర‌పంచంలో ఎక్క‌డా లేక‌పోవ‌డం గ‌మనార్హం. మ్యాచ్‌ల‌ను తిల‌కించ‌డానికి వ‌చ్చే కార్పొరేట్ సంస్థ‌ల య‌జ‌మానులు, ఆయా సంస్థ‌ల్లో ప‌నిచేసే ఉద్యోగుల కోసం ప్ర‌త్యేకంగా ఛార్జీల‌ను వ‌సూలు చేసి, ఈ బాక్సుల‌ను అప్ప‌గిస్తారు. ఈ రూపంలో భారీగా ఛార్జీల‌ను వ‌సూలు చేసే అవకాశం గుజ‌రాత్ క్రికెట్ అసోసియేష‌న్‌కు లభించింది.

ఇండోర్ క్రికెట్ ట్రైనింగ్ అకాడమీ

ఇండోర్ క్రికెట్ ట్రైనింగ్ అకాడమీ

ఇందులోనే ఇండోర్ క్రికెట్ ట్రైనింగ్ అకాడమీ కూడా ఉంటుంది. వీటితో పాటు బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ కోర్టులు... స్క్వాష్ ఎరీనా, టెన్నిస్ ఎరీనా, 3డీ ప్రొజెక్టర్ థియేటర్ అదనం. ల‌క్ష‌ మంది ఒకేసారి ఈ స్టేడియానికి చేరుకోవ‌డానికి అవ‌స‌ర‌మైన ఏర్పాట్ల‌ను కూడా గుజ‌రాత్ క్రికెట్ అసోసియేష‌న్ పూర్తి చేస్తోంది.

స్టేడియానికి 300 మీటర్ల దూరంలో మెట్రో స్టేషన్

స్టేడియానికి 300 మీటర్ల దూరంలో మెట్రో స్టేషన్

అహ్మ‌దాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారుల స‌హ‌కారంతో రోడ్ల విస్త‌ర‌ణ‌ను చేప‌ట్టింది. రోడ్ల విస్త‌ర‌ణ‌కు అయ్యే వ్య‌యం, న‌ష్ట ప‌రిహారం చెల్లింపుల‌ను కూడా గుజ‌రాత్ క్రికెట్ అసోసియేష‌నే భ‌రిస్తోంది. స్టేడియానికి 300 మీటర్ల దూరంలో మెట్రో స్టేషన్ ఉంది. ల‌క్ష‌మంది ఒకేసారి స్టేడియానికి త‌ర‌లి రావ‌డం అంటూ జ‌రిగితే పార్కింగ్ స‌మ‌స్య త‌లెత్తుతుంది.

పాతిక ఎక‌రాల‌ు పార్కింగ్ కోసమే

పాతిక ఎక‌రాల‌ు పార్కింగ్ కోసమే

దీన్ని దృష్టిలో ఉంచుకుని వాహ‌నాల పార్కింగ్ స్థ‌లం కోసం పాతిక ఎక‌రాల‌ను కేటాయించిన‌ట్లు చెబుతున్నారు. ఒకేసారి 15 వేల వాహ‌నాల‌ను ఇక్క‌డ నిలిపి ఉంచే అవ‌కాశాలను క‌ల్పిస్తోంది గుజ‌రాత్ క్రికెట్ అసోసియేష‌న్. మూడు వేలకు పైగా కార్లు, 10 వేలకు పైగా ద్విచ‌క్ర వాహ‌నాల‌ను పార్క్ చేయ‌డానికి వీలుగా పార్కింగ్ స్థ‌లాన్ని తీర్చిదిద్దుతున్నారు.

జనవరి 2020 నాటికి అందుబాటులోకి

జనవరి 2020 నాటికి అందుబాటులోకి

ఈ స్టేడియంలో ప్లడ్ లైట్లకు బదులు అంతటా ఎల్‌ఈడీ లైట్లు వెలుగులు అందించనున్నాయి. ఈ స్టేడియంలో సోలార్ పవర్ జనరేషన్‌తో పాటు 65 వర్షపు నీటి గుంతలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టేడియం నిర్మాణం దాదాపు 90 శాతం పూర్తైంది. జనవరి 2020 కల్లా స్టేడియంలో అందుబాటులోకి రానున్నట్లు గుజరాత్ క్రికెట్ ఆసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పరిమల్ నత్వాని తెలిపారు.

Story first published: Wednesday, December 4, 2019, 13:17 [IST]
Other articles published on Dec 4, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+