Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జట్టులోకి ఎంపిక చేయకపోతే ఆడనని చెప్పా: కుంబ్లే కోసం గంగూలీ

హైదరాబాద్: 2003-04 ఆస్ట్రేలియా పర్యటనకు సెలక్టర్లు అనిల్ కుంబ్లేని జట్టులోకి ఎంపిక చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఆ సమయంలో సెలక్టర్లతో పోరాడి మరీ అనిల్ కుంబ్లేని జట్టులోకి తీసుకునేలా చేశానని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చెప్పాడు. గురువారం ముంబైలో 'సర్ఫ్ ఎక్సెల్' ప్రమోషల్ ఈవెంట్‌లో పాల్గొన్న సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ అనిల్‌ కుంబ్లేను జట్టులోకి తీసుకోకపోతే తాను ఆడనని సెలక్టర్లకు నిర్మోహమాటంగా చెప్పినట్లు తెలిపాడు.

 గొప్ప మ్యాచ్‌ విన్నర్లలో అనిల్ కుంబ్లే ఒకడు

గొప్ప మ్యాచ్‌ విన్నర్లలో అనిల్ కుంబ్లే ఒకడు

'గత 20-25ఏళ్లలో భారత్‌ నుంచి వచ్చిన గొప్ప మ్యాచ్‌ విన్నర్లలో అనిల్ కుంబ్లే ఒకడు. 2003 ఆస్ట్రేలియా పర్యటన సెలక్షన్ మీటింగ్‌కు వెళ్లడం ఇప్పటికీ నాకు గుర్తే' అని గంగూలీ పేర్కొన్నాడు. 'కుంబ్లే ఫామ్‌ కోల్పోయాడని 2003-04 ఆస్ట్రేలియా పర్యటనకు సెలక్టర్లు అనిల్‌ పేరును జట్టులో చేర్చలేదు. నేను సెలక్టర్ల సమావేశానికి వెళ్లిన వెంటనే ఆ విషయం అర్థమైంది. కుంబ్లే మ్యాచ్‌ విన్నర్‌ అని.. ఫామ్‌ కోల్పోవడం తాత్కాలికమేనని చాలాసేపు సెలక్టర్లను కోరాను. భారత్ క్రికెట్‌కు అతడు ఎంతో చేశాడని సెలక్టర్లను అభ్యర్థించాను' అని అన్నాడు.

Sourav Ganguly supports resting of Ashwin, Jadega
 ఎడమచేతి వాటం స్పిన్నర్‌ని ఎంపిక చేద్దామన్న సెలక్టర్లు

ఎడమచేతి వాటం స్పిన్నర్‌ని ఎంపిక చేద్దామన్న సెలక్టర్లు

'వాళ్లు నా మాట వినలేదు. ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎడమచేతి వాటం స్పిన్నర్ బౌలింగ్‌లో ఆడలేరని... అందుచేత ఎడమచేతి వాటం స్పిన్నర్‌ను తీసుకుందామని నాతో అన్నారు. ఇలా సెలక్టర్లకు నాకు మధ్య కొన్ని గంటల పాటు యుద్ధం నడిచింది. చివరికి కోచ్‌ జాన్‌ రైట్‌ కూడా నువ్వు ఎంపిక ప్రక్రియ త్వరగా పూర్తి చేయి వెళిపోదాం అన్నాడు' అని దాదా తెలిపాడు. కుంబ్లేను ఇప్పుడు జట్టు నుంచి తప్పిస్తే ఆయన ఇంకెప్పుడూ భారత్ తరపున ఆడడని రైట్‌కు చెప్పానని, కుంబ్లేను జట్టులోకి తీసుకోకుంటే సెలక్షన్ షీట్‌పై సంతకం పెట్టనని చెప్పానని పేర్కొన్నాడు.

 కుంబ్లే ఓ ఛాంపియన్ బౌలర్

కుంబ్లే ఓ ఛాంపియన్ బౌలర్

దీనికి సెలక్టర్లు తనపై కొంత అసహనంగా చూశారని పేర్కొంటూ 'నువ్వు సరిగా ఆడకపోయినా, జట్టు సరైన ప్రదర్శన కనబరచకున్నా, కుంబ్లే సరిగా ఆడకున్నా జట్టు నుంచి మొదట వెళ్లిపోయేది నువ్వే' అని సెలక్టర్లు తనను హెచ్చరించారని దాదా గుర్తు చేసుకున్నాడు. దానికి తాను 'సరే మంచిది. రిస్క్ తీసుకోవడానికి నేను సిద్ధం' అని దాదా అన్నాడు. 'ఆ సమయంలో జాన్ రైట్‌తో నేను ఒకే మాట చెప్పా. గత 10 సంవత్సరాలుగా కుంబ్లే ఓ ఛాంపియన్ బౌలర్. ప్రస్తుతం అతడు ఫామ్‌లో లేకపోవచ్చు. అది కేవలం తాత్కాలికం మాత్రమే అని అన్నా. చివరకు కుంబ్లేని తీసుకోకపోతే నేనూ ఆ జట్టులో ఉండను అని చెప్పేశాను. ఎట్టకేలకు నా ప్రయత్నం ఫలించింది. కుంబ్లే జట్టులోకొచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలిసిందే' అని దాదా అన్నాడు.

 ఆ సీజన్‌ మొత్తం అద్భుత ప్రదర్శన

ఆ సీజన్‌ మొత్తం అద్భుత ప్రదర్శన

ఆస్ట్రేలియా పర్యటనలోనే కాదు.. ఆ సీజన్‌ మొత్తం అద్భుత ప్రదర్శన చేసిన అనిల్ కుంబ్లే 80 వికెట్లు తీసుకున్నాడు. ఆ ఏడాది టెస్టు క్రికెట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా అనిల్ కుంబ్లే నిలిచాడని సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు. భారత్ తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అనిల్ కుంబ్లేనే కావడం విశేషం.

 10 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌

10 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌

భారత్ తరుపున 132 టెస్టులాడిన అనిల్ కుంబ్లే 619 వికెట్లు తీశాడు. ఇక 271 వన్డేల్లో 337 వికెట్లు తీసుకున్నాడు. న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 74 పరుగులిచ్చి 10 వికెట్లు తీశాడు. తద్వారా భారత్ తరుపున 10 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా కుంబ్లే చరిత్ర సృష్టించాడు.

Story first published: Friday, December 1, 2017, 15:55 [IST]
Other articles published on Dec 1, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+