రవిశాస్త్రి ఏం చేశాడని అతనితో మాట్లాడాలి: గంగూలీ

కోల్‌కతా: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అక్టోబర్ 23న బాధ్యతలు స్వీకరించనున్న తరుణంలో అతనికి ఎన్నో ప్రశ్నలు ఎదురువుతున్నాయి. వాటన్నింటికి గంగూలీ తనదైన శైలిలో సమాధానాలు ఇస్తున్నాడు. గత మూడేళ్ళుగా ఇబ్బందుల్లో ఉన్న బీసీసీఐను తిరిగి గాడిలో పెడతా. ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ల సంక్షేమమే తొలి ప్రధాన్యం. పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధన సమస్యగా మారింది. క్రికెట్ కోసం గొప్ప ఆటగాళ్లను ఎలా వినియోగించుకోవాలో సరిగ్గా అర్థం కావడం లేదు. దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలి అని పలు సమాధానాలు ఇచ్చాడు.

రవిశాస్త్రి ఏం చేశాడని మాట్లాడాలి:
భారత్-పాక్‌ల మధ్య ద్వైపాక్షిక సిరిస్‌లు జరగాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని కూడా గంగూలీ చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రితో మాట్లాడారా? అని ఓ మీడియా వ్యక్తి గంగూలీని ప్రశ్నించాడు. దీనికి గంగూలీ ఇచ్చిన సమాధానంతో ఆ వ్యక్తికి ఒక్కసారిగా దిమ్మతిరిగింది. 'ఎందుకు? ఇప్పుడు రవిశాస్త్రి ఏం చేశాడని మాట్లాడాలి' అని గంగూలీ గట్టిగా నవ్వేశాడు. దీంతో సదరు వ్యక్తి మరేం మాట్లాడకుండా ఉండిపోయాడు.

గంగూలీపై శాస్త్రి విమర్శలు
బీసీసీఐ అధ్యక్షుడి రేసులో గంగూలీ ఉన్నాడని తెలిసి.. క్రికెట్ అభిమానుల గంగూలీ-రవిశాస్త్రిల వివాదం గురించే చర్చించారు. 2016లో అనిల్ కుంబ్లే టీమిండియా కోచ్ కావడం వెనక గంగూలీ హస్తం ఉందంటూ శాస్త్రి విమర్శలు చేసాడు. సీఏసీలో దాదా కూడా సభ్యుడు కావడమే దీనికి కారణం. కెప్టెన్ విరాట్ కోహ్లీతో సరిగా సంబంధాలు లేకపోవడం, ఇతర కారణాల వల్ల 2017లో కుంబ్లే కోచ్ పదవికి రాజీనామా చేసాడు. అనంతరం రవిశాస్త్రి కోచ్ అయ్యారు. రెండోసారి కూడా మళ్లీ కోచ్ పదవిలో కొనసాగుతున్నారు.

అక్టోబర్ 23న బాధ్యలు
బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ అక్టోబర్ 23న బాధ్యలు చేపట్టనున్నాడు. కొత్త నిబంధనల ప్రకారం గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పదవిలో పది నెలల పాటు (సెప్టెంబర్ 2020) కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం కోల్‌కతా క్రికెట్ బోర్డు (క్యాబ్) అధ్యక్షుడిగా దాదా కొనసాగుతున్నాడు. బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టాక క్యాబ్ పదవిని దాదా వదిలేయనున్నాడు.

1992లో అరంగేట్రం:
గంగూలీ కెరీర్‌లో 113 టెస్ట్‌లు, 311 వన్డేలు ఆడాడు. 1992లో జాతీయ జట్టుకు అరంగేట్రం చేసిన గంగూలీ కెరీర్.. 1996లో టెస్ట్‌ల్లో ఆడడం ప్రారంభించాక కొత్త శిఖరాలకు చేరింది. 2000 నుంచి 2005 వరకు భారత సారథిగా వ్యవహరించిన దాదా.. 2008లో ఆటకు వీడ్కోలు పలికాడు. 2003లో టీమిండియాను ప్రపంచకప్ ఫైనల్లోకి తీసుకెళ్లాడు. రిటైర్మెంట్ అనంతరం కొద్ది సీజన్ల పాటు ఐపీఎల్‌లో ఆడాడు. ఇక 2015లో తొలిసారి క్యాబ్ చీఫ్‌గా ఎన్నికైన గంగూలీ ప్రస్తుతం రెండోసారి ఆ పదవిలో ఉన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications