For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కొత్త బాస్‌గా గంగూలీ: ఆ అర్హత ఉందన్న గవాస్కర్

మాజీ కెప్టెన్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్న తరుణంలో సునీల్ గవాస్కర్ కూడా గంగూలీకి ఆ సత్తా ఉందని అన్నాడు. 
 

By Nageshwara Rao

హైదరాబాద్: లోధా కమిటీ ఇచ్చిన సిఫారసులు అమలు చేయలేదనే కారణంతో బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్‌ షిర్కేను సుప్రీం తొలగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీసీసీఐ కొత్త అధ్యక్షుడు ఎవరు? అనే దానిపై ఆసక్తి నెలకొంది.

సుప్రీం తీర్పు నేపథ్యంలో టీమిండియా క్యాబ్ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీనే బీసీసీఐ అధ్యక్షుడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్న తరుణంలో మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలు తీసుకునే అర్హత గంగూలీకి ఉందని అన్నాడు.

ఎన్టీటీవీకి ఇచ్చిన ఇంటర్యూలో మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ సంక్షోభ సమయంలో బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునే అర్హత గంగూలీకి ఉందని అభిప్రాయపడ్డాడు. సుప్రీం తీర్పుని అందరూ గౌరవించాల్సిందేనని సన్నీ స్పష్టం చేశాడు.

మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వివాదం

మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వివాదం

‘1999-2000 మధ్య కాలంలో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వివాదం టీమిండియాను చుట్టుముట్టినప్పుడు కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న గంగూలీ దాని నుంచి బయటపడేశాడు. ఇప్పుడు బోర్డును కూడా కష్టాల్లోంచి బయట పడేయగల సత్తా సౌరభ్‌కు ఉంది' అని గవాస్కర్ తెలిపాడు.

బీసీసీఐ అంతర్జాతీయంగా తన ఫేస్‌ను కోల్పోయింది

బీసీసీఐ అంతర్జాతీయంగా తన ఫేస్‌ను కోల్పోయింది

సుప్రీం తీర్పుతో బీసీసీఐ అంతర్జాతీయంగా తన ఫేస్‌ను కోల్పోయిందని, ఏది ఏమైనప్పటికీ దీని వల్ల భారత్ క్రికెట్‌కు మంచి జరుగుతుందని తాను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. సుప్రీం తీర్పుని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందేనని చెప్పారు. ఐపీఎల్‌లో స్ఫాట్ ఫిక్సింగ్ వివాదం వెలుగు చూసిన తరుణంలో ఎన్ శ్రీనివాసన్ స్ధానంలో బీసీసీఐ తాత్కాలిక అధ్యక్ష పదవిలో సునీల్ గవాస్కర్ కొన్నాళ్లు నియమితులైన సంగతి తెలిసిందే.

క్యాబ్ అధ్యక్షుడిగా సౌరభ్ గంగూలీ

క్యాబ్ అధ్యక్షుడిగా సౌరభ్ గంగూలీ

మరోవైపు బీసీసీఐ పాలనా వ్యవహారాలకు సంబంధించి తొలగించి వారి స్ధానంలో కొత్త సభ్యులను ఎన్నుకునే బాధ్యతలను ప్రభుత్వ న్యాయవాదులైన గోపాల్‌ సుబ్రహ్మణియమ్, ఫాలీ ఎస్‌ నారిమన్‌లకు సుప్రీం కోర్టు సూచించింది. ప్రస్తుతం క్రికెట్ అసోషియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడిగా ఉన్న సౌరభ్ గంగూలీ సమర్థత, నిజాయితీ లాంటి అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని అతడి పేరు ఖాయమైనట్టే అని క్రికెట్ వర్గాలు అనుకుంటున్నాయి.

గంగూలీ అయితేనే సమర్ధవంతంగా నడపగలరు

గంగూలీ అయితేనే సమర్ధవంతంగా నడపగలరు

అయితే దీనిపై గంగూలీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అనే సందేహాన్ని కూడా కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డుగా పేరున్న బీసీసీఐని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అయితేనే సమర్ధవంతంగా నడపగలడని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+