న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దాదా వల్లే అది సాధ్యం: భారత్-పాక్‌ల మధ్య ద్వైపాక్షిక సిరిస్‌లపై మాజీ కెప్టెన్

Sourav Ganguly can help resume India-Pakistan bilateral cricket ties: Rashid Latif

హైదరాబాద్: భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరిస్‌లు జరగనంత వరకు ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగవ్వవని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్‌ లతీఫ్‌ వ్యాఖ్యానించాడు. ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు మెరుగవ్వడానికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ చొరవ చూపాలని 'ది నేషన్'కు ఇచ్చిన ఇంటర్యూలో చెప్పాడు.

2004లో భారత జట్టు పాకిస్థాన్‌ పర్యటనకు సంబంధించి అప్పటి కెప్టెన్‌గా ఉన్న సౌరవ్ గంగూలీ బీసీసీఐని ఒప్పించడంలో కీలకపాత్ర పోషించాడని రషీద్‌ లతీఫ్‌ పేర్కొన్నాడు. ఒక క్రికెటర్‌గా, బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ ఇప్పుడు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ)తో పాటు ఇషాన్ మణికి సాయం చేయగలడని ఆయన పేర్కొన్నాడు.

ఇంటర్యూలో వెల్లడి: బుమ్రాకు యార్కర్లు విసరడం నేర్పించింది మలింగ కాదంట!ఇంటర్యూలో వెల్లడి: బుమ్రాకు యార్కర్లు విసరడం నేర్పించింది మలింగ కాదంట!

పీసీబీ సీఈఓ వసీంఖాన్‌ సైతం పెద్ద జట్లను పాక్‌లో పర్యటించడానికి తన వంతు కృషి చేయాలని అన్నాడు. దీని ద్వారా స్థానిక ఆటగాళ్లకు, పాకిస్థాన్‌ క్రికెట్‌కు ఎంతో లబ్ధి చేకూరుతుందని చెప్పాడు. "2004లో, బీసీసీఐ పాకిస్థాన్ పర్యటనకు విముఖత చూపినప్పుడు గంగూలీ బీసీసీఐతో పాటు ఆటగాళ్లను ఒప్పించాడని ఈ సందర్భంగా గుర్తు చేశాడు.

కోహ్లీ వైరల్ ఫోటో: అప్పుడు స్లిప్పర్లు.. ఇప్పుడు ప్యూమా షూ!!కోహ్లీ వైరల్ ఫోటో: అప్పుడు స్లిప్పర్లు.. ఇప్పుడు ప్యూమా షూ!!

చాలా కాలం తర్వాత ఇక్కడ పెద్ద విజయాన్ని సాధించడంతో ఆ పర్యటన భారతదేశానికి చాలా గుర్తుండిపోయే పర్యటనగా మిగిలిపోయిందని అన్నాడు. ఐదు వన్డేల సిరీస్‌ను 3-2 తేడాతో, మూడు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో గంగూలీ నాయకత్వంలో టీమిండియా విజయం సాధించింది. కాగా, ఇటీవలే శ్రీలంక జట్టు పాక్‌లో పర్యటించి సంగతి తెలిసిందే.

Story first published: Friday, January 3, 2020, 18:33 [IST]
Other articles published on Jan 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X