కోహ్లీ చురుకైన కెప్టెన్ కాదు: గంభీర్ వ్యాఖ్యలతో విబేధించిన దాదా


హైదరాబాద్: ధోని, రోహిత్ శర్మలతో పోలిస్తే విరాట్ కోహ్లీ అంత చురుకైన కెప్టెన్ కాదని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలతో ఢిల్లీ క్యాపిటల్స్ సలహాదారు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ విభేదించారు. విరాట్ కోహ్లీ ఛాంపియన్ ప్లేయర్ అని, అతడిని జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించే ప్రసక్తే లేదని సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు.
వివరాల్లోకి వెళితే ఐపీఎల్‌లో చెన్నై, ముంబై జట్లకు ధోని, రోహిత్ మూడేసి టైటిళ్లు అందించగా ఆర్సీబీ జట్టుని కెప్టెన్‌గా కోహ్లీ ఒక్కసారి కూడా విజేతగా నిలపలేకపోయాడు. దీనిపై గంభీర్ మాట్లాడుతూ "కోహ్లీ నాకు అంత చురుకైన కెప్టెన్‌లా కనిపించడు. గొప్ప వ్యూహాలు రచించేలా కూడా కనిపించడు. ఇప్పటిదాకా అతను ఒక్కసారీ ఐపీఎల్ ట్రోఫీ గెలవలేదు" అని వ్యాఖ్యానించాడు.

రికార్డును బట్టే కెప్టెన్ ప్రతిభను అంచనా వేస్తాం
అంతేకాదు "ఎప్పుడైనా ఈ రికార్డును బట్టే కెప్టెన్ ప్రతిభను అంచనా వేస్తాం. ధోని, రోహిత్ మూడేసిసార్లు కప్పు గెలిచారు. ఈ దశలో వాళ్లిద్దరితో విరాట్ కోహ్లీని పోల్చలేం. అతను ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. మొదట్నుంచి విరాట్ కోహ్లీ బెంగళూరు జట్టుతోనే ఉన్నాడు. ఏడెనిమిదేళ్లుగా జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఫ్రాంఛైజీ ఇంకా తనను కెప్టెన్‌గా కొనసాగిస్తున్నందుకు అదృష్టవంతుడే. టైటిల్ గెలవకుండా ఏ కెప్టెన్ ఇంత కాలం కొనసాగడు" అని అన్నాడు.

గంగూలీ మాట్లాడుతూ
ఈ వ్యాఖ్యలపై గంగూలీ మాట్లాడుతూ "క్రికెట్‌కు కోహ్లీ ఏం చేశాడో దాని వల్లే అతడు కెప్టెన్‌గా కొనసాగింపబడుతున్నాడు. ప్రతి ఫార్మాట్‌లోనూ బ్యాట్‌తో అతడు అద్భుతాలు చేశాడు. అతడొక ఛాంపియన్ ప్లేయర్. ఆర్సీబీ జట్టుకు కెప్టెన్ అయ్యేందుకు అన్ని అర్హతలు అతడికి ఉన్నాయి. నేను విశ్వసిస్తున్నా.. ఈసారి తప్పక టైటిల్ గెలుస్తాడు" అని చెప్పాడు.

భారత జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు
ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా చాలా సమర్థవంతమైన జట్టని గంగూలీ అన్నాడు. "టోర్నీల్లో ఫలానా జట్టే ఫేవరెట్ అంటూ ఉండే అభిప్రాయాలను నేను నమ్మకపోయినప్పటికీ, భారత జట్టు అన్ని టోర్నీల్లోనూ ఫేవరెట్‌గా ఉంటుందన్న విషయాన్ని చెప్తున్నా. జట్టులో ధావన్, రోహిత్, కోహ్లీ, ధోనీ, బుమ్రా, కుల్దీప్, భువీ లాంటి మంచి నైపుణ్యాలు ఉన్న ఆటగాళ్లు ఉన్నారు" అని దాదా తెలిపాడు.

కోహ్లీ ఛాంపియన్ ప్లేయర్
"టీమిండియాలో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఆటగాడు. అతడు బ్యాటింగ్‌లో ఏ స్థానంలోనైనా దిగగలడు. అయితే, అతడు మూడో స్థానంలో దిగడమే సరైంది. కోహ్లీ పూర్తి స్థాయి ఛాంపియన్. ప్రతి తరంలోనూ ఇటువంటి ఛాంపియన్లు ఉన్నారు. మా తరంలో సచిన్, రికీ పాంటింగ్, లారా వంటి ఆటగాళ్లు ఉన్నారు" అని గంగూలీ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications