Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్యాబ్ అధ్యక్షుడిగా గంగూలీ: కృతజ్ఞతలు (వీడియో)

బెంగాల్: క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్ బెంగాల్ (క్యాబ్‌) అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ పేరు ఖరారైంది. మొన్నటి వరకు క్యాబ్ అధ్యక్షుడిగా ఉన్న జగ్మోహాన్ దాల్మియా హ‌ఠార్మ‌ణంతో క్యాబ్ అధ్యక్ష పదవి ఖాళీ ఏర్పడిన సంగతి తెలిసిందే.

Sourav Ganguly to be the next President of Cricket Association of Bengal (CAB)

దీంతో క్యాబ్ అధ్యక్ష పదవికి సౌరభ్ గంగూలీని ఎన్నుకున్నారు. క్యాబ్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత సౌరభ్ గంగూలీ మీడియాతో మాట్లాడుతూ తనపై ఇంత పెద్ద భారాన్ని ఉంచిన సహచరులకు కృతజ్ఞతలు తెలిపాడు. అంతకముందు గంగూలీ క్యాబ్ సంయుక్త కార్యదర్శిగా ఉన్న సంగతి తెలిసిందే.

అంతకముందు గంగూలీకి క్రికెట్ పాలనా అనుభవం తక్కువ అనే అభిప్రాయం వినిపించింది. క్యాబ్ అధ్యక్ష పదవి కోసం బెంగాల్‌లోని అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు అరూప్‌ బిస్వాల్‌, సుబ్రతా ముఖర్జీ అధ్యక్ష పదవిపై కన్నేసిన సంగతి తెలిసిందే.

వీటన్నింటికీ తెరదించుతూ క్యాబ్ అధ్యక్షుడిగా గంగూలీ బాధ్యత చేపట్టబోతున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. క్యాబ్‌లోదాల్మియా కుమారుడు అభిషేక్‌కు కూడా కీలక పదవి దక్కే అవకాశం ఉంది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+