Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మీకు వైట్ వాషే: ఇంగ్లాండ్ జట్టుకు దాదా హెచ్చరిక

కోల్‌కత్తా: ఐదు టెస్టుల సిరిస్‌లో భాగంగా భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టుకు ఘోర పరాభవం తప్పదని మాజీ కెప్టెన్, క్యాబ్ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ జోస్యం చెప్పాడు. ఇంగ్లాండ్ టెస్టు సిరిస్‌కు సంబంధించి బుధవారం గంగూలీ మీడియాతో మాట్లాడాడు.

మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

న్యూజిలాండ్ జట్టుకు జరిగిన ఘోర పరాభవాన్ని ఉదహరిస్తూ ఇంగ్లాండ్ జట్టు కూడా వైట్ వాష్ కావడం ఖాయమని పేర్కొన్నాడు. ప్రస్తుతం టీమిండియా అద్భుతమైన ఫామ్‌లో ఉందని ఇంగ్లాండ్ జట్టు ఓటమి పాలవడం ఖాయమని గంగూలీ వ్యాఖ్యానించాడు.

Sourav Ganguly backs India to whitewash England 5-0

'టీమిండియా అద్భుతమైన క్రికెట్ ఆడుతోంది. న్యూజిలాండ్ తరహాలో ఇంగ్లండ్ జట్టును కూడా వైట్ వాష్ చేయాలని ఆశిస్తున్నా. టీమిండియా క్రికెట్ జట్టు ఫామ్‌ను చూస్తే ఇది ఏమాత్రం కష్టం కాదు. భారత పర్యటనలో మీకు భంగపాటు తప్పదు' అని గంగూలీ పేర్కొన్నాడు.

అంతకముందు మంగళవారం ఇంగ్లాండ్ జట్టులో కూడా అత్యుత్తమ స్పిన్నర్లు ఉన్నారని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ స్పష్టం చేసిన నేపథ్యంలో గంగూలీ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో చివరిదైన మీర్పూర్ టెస్టులో ఇంగ్లాండ్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

కోహ్లీకి మరో ఛాన్స్: అజారుద్దీన్ రికార్డుపై గురి

అయితే దీనిని ఉద్దేశించి బంగ్లా పర్యటనలో చివరి టెస్టులో ఓటమి చెందడాన్ని పట్టించుకోవద్దంటూ వాన్ సూచించాడు. భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాల నుంచి ప్రమాదం ఉందనే విషయాన్ని పక్కన పెట్టి ఇంగ్లాండ్ ఆటగాళ్లు సహజసిద్ధమైన ఆట ఆడాలని వాన్ సూచించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+